ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా విజయవాడ కస్తూరిబాయిపేట (Vijayawada Kasturibaipet)లో కొండ చరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడిన సమయంలో ఇంట్లో ఉన్న అరుణ అనే మహిళకు గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి. బాధితులను సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు ( ch baburao) పరామర్శించారు. గతంలోనూ అనేక సార్లు ఈ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడినా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టలేదని బాబురావు విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయని, వారి రక్షణకు విజయవాడ ( vijayawada) నగర పాలక సంస్థ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి విశాఖ (vishaka) జిల్లా కేకే లైన్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ళు రైల్వే ట్రాక్‌పై పడడంతో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. దీంతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కిరండోల్ నుంచి విశాఖ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటన జూలై 11న జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు రాయ్‌ఘడ్ (Raigad)లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. శిథిలాల్లో మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.