Amalapuram: అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. వైసీపీ నేత మంత్రి పినిపే విశ్వరూప్ కు వ్యతిరేకంగా కుంచే రమణారావు అత్మియ సమావేశం నిర్వహించారు. ఇంతకాలం స్థానికేతరులకు టిక్కెట్లు ఇస్తే పల్లకీ మోశాం.. ఇకపై కుదరదు..స్థానికులకే వైసీపీ టిక్కెట్టు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడటం లేదని మంత్రి విశ్వరూప్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తి మళ్లీ పోటీ చేస్తానంటే మేము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు.
Also Read: పెనుగొండ వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు..!
మొన్న శెట్టిబలిజ సంఘ నేత వాసంశెట్టి సుభాష్ , మరికొందరు కార్యకర్తలు వైసిపి స్థానిక నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. నేడు స్థానిక నాయకత్వం పై కుంచే రమణారావు అసంతృప్తి గళం వినిపించారు. సర్వేలో వ్యతిరేకత ఉన్న వాళ్లకు టిక్కెట్టు ఇస్తే తెలంగాణా పరిస్థితే వైసీపీకి ఎదురవుతుందని అంటున్నారు. పార్టీలో పనిచేసిన వారికి పదవులు లేవని.. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లకు పదవులను కట్ట బెడుతున్నాని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: ఎంపీ బాలశౌరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా.!
వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే తమకు అభిమానం అని ఆయనతోనే ఉంటామని..కాని, అమలాపురం టిక్కెట్ లోకల్ అభ్యర్థులకు కాని..తనకు కాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పినిపే విశ్వరూప్ కు కాని, కుమారుడు శ్రీకాంత్ కు కాని ఇస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఆయన ఓడిపోతారని సర్వేలు చెబుతుంటే ఇచ్చినా ఉపయోగం లేదని అంటున్నారు.
అ