Shraddha Kapoor : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.!

బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా నటి శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. వాసన్ బాలా 'స్త్రీ2' చిత్రాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్‌లో శ్రద్ధా గురించి ప్రస్తావించకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వాసన్ బాలా తన పొరపాటుకు శ్రద్ధా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపారు.

Shraddha Kapoor : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్  క్షమాపణలు.!
New Update

Vasan Bala Sorry To Shraddha Kapoor Fans : శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) జంటగా నటించిన చిత్రం 'స్త్రీ 2'. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విమర్శకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు సైతం పొందుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా కూడా 'స్త్రీ 2' (Stree 2) చిత్రాన్ని ప్రశంసిస్తూ ఇటీవలే ఓ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్టులో శ్రద్ధా తప్పా సినిమాలోని మిగతా అందరి గురించి ప్రస్తావించాడు. దీంతో శ్రద్దా ఫ్యాన్స్ ఆయన పై విమర్శలు చేశారు.

శ్రద్ధా ప్రశంసలు  

ఇది ఇలా ఉండగా.. వాసన్ బాలా దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'జిగ్రా' ట్రైలర్ పై శ్రద్దా ప్రశంసలు కురిపించింది. “ఇది నా సోదరుడితో కలిసి థియేటర్‌లో చూడాలి. వాసన్ బాలా (Vasan Bala) ఎంత అద్భుతమైన ట్రైలర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది''. ఇక శ్రద్దా పోస్ట్ చూసిన వెంటనే ఆమె అభిమానులు వాసన్ బాలా 'స్త్రీ 2' ను ప్రశంసిస్తూ శ్రద్దా పేరును ప్రస్తావించపోవడాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో వాసన్ బాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

publive-image

వాసన్ బాలా క్షమాపణలు 

దీంతో దర్శకుడు వాసన్ బాలా 'జిగ్రా' ట్రైలర్ పై శ్రద్దా చేసిన పోస్టుకు రిప్లై ఇస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలియజేడంతో పాటు 'స్త్రీ 2' విషయంలో తాను చేసిన పొరపాటుకు శ్రద్దా, ఆమె అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

publive-image

Also Read: Premikudu Re-Release: ఊర్వశీ.. ఊర్వశీ.. ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్ - Rtvlive.com

#shraddha-kapoor #director-vasan-bala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe