VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై సోషల్ మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు.ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ 4 ఏళ్లుగా ఆలస్యం చేస్తోందన్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

New Update
VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Director V.N Adithya Fires On People Media Factory Producers : వి.ఎన్ ఆదిత్య టాలీవుడ్ లో ఒకప్పుడు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో ఈయన చేసిన మనసంతా నువ్వే అప్పట్లో 200 రోజుల పాటు దిగ్విజయంగా ఆడి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన నేనున్నాను, బాస్ వంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి. 2011 తర్వాత ఆయన తెలుగు సినిమాలే చేయలేదు. 2018లో ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు దానివల్ల వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మూడు సినిమాలు తీశాడు. కానీ ఇప్పటి దాకా రిలీజ్ కు నోచుకోలేదు.

ఈక్రమంలోనే తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై సోషల్ మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ నాలుగేళ్లుగా ఆలస్యం చేస్తోందని వెల్లడించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు "మిస్టర్ బచ్చన్," "విశ్వం," "మా కాళి,", "స్వాగ్"తో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన తర్వాత తన ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా మూడు సెన్సిబుల్, విలువైన సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాను, మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అర క్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది.” అని తన ఫేస్‌బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

Also Read : “ఆ సీన్ చీకటి గదిలో చేశారు”… భయమేసి బయటకు వెళ్ళిపోయిన షాలిని..!

కాగా వి.ఎన్ ఆదిత్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో లవ్ @ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు వంటి మూడు సినిమాలను తెరకెక్కించాడు. అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి సదరు నిర్మాతలు రిలీజ్ చేయకపోవడం ఇప్పుడు ఇండిస్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంలో పలువురు దర్శకుడికి తమ సపోర్ట్ తెలుపుతూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై అసహనం వ్యక్త్రం చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆదిత్య సినిమాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు సరైన కారణాలు బయటికి రానప్పటికీ.. డైరెక్టర్ ను ఇబ్బంది పెడుతున్నట్టు స్పష్టమవుతుంది. కార్తికేయ 2, ఓ బేబీ, ధమాకా, ఈగల్ వంటి సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది. అలాంటి ఈ ప్రొడక్షన్ హౌజ్ పై ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం.

Advertisment
Advertisment
తాజా కథనాలు