RGV: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరు ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ ఎగ్జిట్ పోల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా వర్మ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ఆర్జీవీ చేసిన ట్వీట్ చూడాలంటే పూర్తి వార్తను చదవండి.

New Update
RGV: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే

RGV Survey On AP Elections Results: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీలో ఆ పార్టీదే అధికారం అంటూ సర్వే సంస్థలు మైకులు వేసుకొని ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరు ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ ఎగ్జిట్ పోల్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు మీరు చెప్పింది నిజమే అన్న అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకు ఆర్జీవీ చేసిన ట్వీట్ లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అని అనుకుంటున్నారా?. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. అలాగే టీడీపీ కూటమి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమికి 0-25 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఓ ట్వీట్ ను షేర్ చేశారు. అయితే రాము మంచి బాలుడు ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేందుకు రెండు పార్టీలకు సరిసమాన సీట్లను ఇచ్చారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే మార్పులు ఏంటీ ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు