RGV Movie: 'నా పెళ్ళాం దెయ్యం'.. వైరలవుతున్న ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్

టాలీవుడ్ ఫేమస్ దర్శకుడు ఆర్జీవీ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. 'నా పెళ్ళాం దెయ్యం' అంటూ ట్విట్టర్ వేదికగా మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో అలరించిన ఆర్జీవీ ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
RGV Movie: 'నా పెళ్ళాం దెయ్యం'.. వైరలవుతున్న ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్

RGV New Movie - Naa Pellam Deyyam: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వర్మ ఇటీవలే వ్యూహం సినిమాతో (Vyooham Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం.. అతని కుమారుడు జగన్ మొహన్ రెడ్డి (YS Jagan) ఎలా సీఎం అయ్యారు..? అనే నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకుందని చెప్పొచ్చు.

'నా పెళ్ళాం దెయ్యం' ఆర్జీవీ కొత్త సినిమా 

ఇది ఇలా ఉంటే తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు దర్శకుడు ఆర్జీవీ. 'నా పెళ్ళాం దెయ్యం' అంటూ ట్విట్టర్ వేదికగా మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. 'నా పెళ్ళాం దెయ్యం' సినిమా హర్రర్ కామెడీ డ్రామాగా జానర్ లో రాబోతున్నట్లు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక భర్త కొంత కాలం తర్వాత.. తన భార్యను ఒక దెయ్యంలా ఎందుకు భావిస్తాడు అనేది ఈ సినిమా కథ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో అలరించిన ఆర్జీవీ ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ‘టిల్లు స్క్వేర్’ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు