Also Read: లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ… వైరల్ అవుతున్న ఫోటో
గతంలో లిషిగణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూట్యూబర్ గా ఫేమస్ అయిన లిషిగణేష్‌ను పోలీసులు విచారిస్తామంటున్నారు. FIRలో A1గా మంజీరా గ్రూపు డైరెక్టర్ గజ్జల వివేకానంద్ , A2-అబ్బాస్ రాడిసన్ కేంద్రంగా డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో రాడిసన్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. మొత్తం 10 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్!
FIRలో A1గా గజ్జల వివేకానంద్, A2-అబ్బాస్‌తోపాటు నిర్భయ్, రఘు చరణ్, కేదార్, సందీప్, నీల్, క్రిష్ జాగర్లమూడి, శ్వేత, లిషి పేర్లు ఉన్నాయి. డ్రగ్స్ తీసుకున్నట్లు వివేకానంద్ ఇప్పటికే ఒప్పుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు వివేకానంద్‌కు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అబ్బాస్ ద్వారా 3 గ్రాముల కొకైన్ తెప్పించారు వివేకానంద్. నిందితుల్లో కేదార్‌కు పలువురు ఫిల్మ్‌స్టార్లతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
నిందితులంతా బడాబాబులు, వ్యాపారవేత్తల పిల్లలేనని సమాచారం. వివేకానంద్, నిర్భయ్, కేదార్ ముగ్గురికీ మెడికల్ టెస్టులు నిర్వహించగా..యూరిన్ టెస్టులో ముగ్గురికీ డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది.