Director Harish Shankar : రవితేజ (Ravi Teja) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' (Mister Bachchan) మూవీ నేడు (ఆగస్టు 15) న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ హరీష్ శంకర్ పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు హరిష్ శంకర్ తన స్పందన తెలిపారు.
ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మిక్స్‌డ్ రివ్యూలపై ఎదురైన ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ.." సినిమా విడుదలైనప్పుడు అన్ని రకాల స్పందనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి అభిప్రాయం విలువైనదే. మిశ్రమ స్పందనలు చాలా సినిమాలకు వచ్చాయి. ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో కొత్తేమీ కాదు. నాకు నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు. ప్రతి షోకు పాజిటివ్ టాక్ పెరుగుతోంది.
Also Read : పవన్ కళ్యాణ్ పై భారీ ట్రోలింగ్.. ఉరికి, ఆత్మహత్యకి తేడా తెలీదంటూ నెటిజన్ల మండిపాటు
మాస్ సినిమా కాబట్టి ఏ సెంటర్లతో పోలిస్తే బీ, సీ సెంటర్లలో రెస్పాన్స్ బాగుంది. కథ డిమాండ్ మేరకే సిద్ధు జొన్నలగడ్డను అతిథి పాత్రకు ఎంపిక చేశాం. అతడి ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్లందని చాలామంది అంటున్నారు. స్క్రిప్టులోని ఓ భారీ డైలాగ్‌ను అప్పటికప్పుడు తానే చెప్పేశాడు. ఈ సందర్భంగా సిద్ధుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని అన్నారు.