/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T172727.494-jpg.webp)
RC16 Talent Hunt: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో రాబోతున్న RC16. రామ్ చరణ్ (Ram Charan) 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను RC16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన నటీ నటులను వెతికే పనిలో బిజీ అయిపోయారు మేకర్స్. దీనికి సంబంధించి.. ఫిబ్రవరి నెలలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో (Vishakapatnam) ఆడిషన్స్ జరగనున్నాయని ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు దీని గురించి మరో వీడియోను రిలీజ్ చేశారు.
డైరెక్టర్ బుచ్చిబాబు వీడియో
"ఈ సినిమా ఉత్తరాంధ్ర (Uttarandhra) ప్రాంత కథ కావడంతో.. ఆ ప్రాంతానికి చెందిన వారు ఈ సినిమాకు చాలా అవసరం. ఈ సినిమా స్టోరీ అంతా విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, రాయి గడ్డ, బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సినిమా చాలా ప్రామాణికంగా ఉండాలని ట్రై చేస్తున్నాము... ఆ ప్రాంతానికి చెందిన నటీ నటులు ఉంటే సినిమాకు రియల్ ఫీల్ వస్తుంది. అందుకే ఔత్సాహిక నటీనటుల అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతీ ఒక్క పాల్గొనే అవకాశం ఉందని మరో సారి వీడియో ద్వారా తెలిపారు డైరెక్టర్ బుచ్చిబాబు.
A call out by director @BuchiBabuSana to all the aspiring actors to be a part of the MASSive #RC16 ❤️🔥❤️🔥
We begin our talent hunt in Uttarandhra 🎬
Email ID to reach out to in case of any clarifications : [email protected] #RamCharanRevolts
Global Star… pic.twitter.com/ZnOfR31url— Vriddhi Cinemas (@vriddhicinemas) February 7, 2024
ప్రస్తుతం రాంచరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థిల్లర్ గా రోపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, S. J. సూర్య, అంజలి, సముద్రకని, శ్రీకాంత్, నాసర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.