Director Anudeep: వావ్ క్రేజీ కాంబో.. అనుదీప్ నెక్స్ట్ మూవీ హీరో ఎవరో తెలుసా..!

జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలో పాపులర్ డైరెక్టర్ గా ఎదిగిపోయారు అనుదీప్. ఇక ఇప్పుడు అనుదీప్ చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి నెట్టింట్లో ఓ న్యూస్ వైరలవుతుంది. తన నెక్స్ట్ మూవీ రవితేజతో చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పై చర్చలు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
Director Anudeep: వావ్ క్రేజీ కాంబో.. అనుదీప్ నెక్స్ట్ మూవీ హీరో ఎవరో తెలుసా..!

Director Anudeep: అనుదీప్ కె వి.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు చేసి.. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఈ యువ డైరెక్టర్. అనుదీప్ కథల్లో నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అనుదీప్ సినిమాల్లో కామెడీ, పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.

జాతిరత్నాలు సినిమాతో ఫేమ్ 

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అనుదీప్.. ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. 2021 లో విడుదలైన జాతిరత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో పాటు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. డైరెక్టర్ గా అనుదీప్ కెరియర్ కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ప్రేక్షకులలో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇదే ఫార్మ్ లో తమిళ నటుడు కార్తికేయతో తన రెండో సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ మూటకట్టుకుంది. ఆ తర్వాత కొంత కాలంగా తన నెక్స్ట్ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు అనుదీప్.

Also Read: Ariyana Glory: కుర్రకారుకు కిక్కెస్తున్న అరియానా అందాలు.. ఈ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

publive-image

రవితేజతో అనుదీప్ నెక్స్ట్ మూవీ 

ఇక తాజాగా అనుదీప్ చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ ను సెలెక్ట్ చేశారట. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఇక ఇది నిజమైతే వీళ్లిద్దరి కాంబో సూపర్ క్రేజీ అనే చెప్పాలి. రవితేజ ఆన్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అనుదీప్ కామెడీ, వన్ లైనర్స్ మామూలుగా ఉండవు. ఇప్పుడు వీళిద్దరి కాంబోలో సినిమా అంటే రవితేజ ఫ్యాన్స్ కు పండగే.

Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో

Advertisment
తాజా కథనాలు