ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ సూపర్ విక్టరీ

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్ల సెక్టార్లలోని 12స్థానాల్లో దిల్ రాజు ప్యానల్‌కు చెందిన ఏడుగురు గెలిచారు. గతంలో లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు. అధ్యక్ష పదవి కోసం దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడ్డారు.

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ సూపర్ విక్టరీ
New Update

దిల్ రాజు దూకుడు..

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్ల సెక్టార్లలోని 12స్థానాల్లో దిల్ రాజు ప్యానల్‌కు చెందిన ఏడుగురు గెలిచారు. గెలిచిన వారిలో దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, యలమంచిలి రవి, స్రవంతి రవికిశోర్, మోహన్ గౌడ్, పద్మిని ఉన్నారు. స్టూడియో సెక్టార్‌ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గరు దిల్ రాజు ప్యానల్‌కు చెందిన వారు ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌ నుంచి ఇరు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలిచారు. ఈ గెలుపుతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

రికార్డు స్థాయిలో పోలింగ్..

నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య పోటీ జరగ్గా.. మొత్తం 1339 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లో 1600 ఓట్లకు గాను 891.. స్టూడియో సెక్టార్‌లో 98 ఓట్లకు 68, డిస్ర్టిబ్యూషన్‌ సెక్టార్‌ లో 597ఓట్లకు 380 ఓట్లు పోల్‌ అయ్యాయి. గతంలో లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభంకాగా.. 6 గంటలకు ఫలితాలు తేలాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు జరుగుతుంటాయి. తెలుగు ఇండస్ట్రీలోని అన్ని విభాగాలకు ఫిల్మ్ ఛాంబర్ అథారిటీగా ఉంటుంది.

తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానెల్స్‌కు చెందిన సభ్యుల మధ్య వివాదం జరిగింది. దీంతో పలువురు నిర్మాతలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభ్యులు దేనికి పోటీపడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలో.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. తాను కూడా ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని ఇలాంటి వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదని వాపోయారు.

కాగా ఎన్నికలకు ముందు దిల్ రాజు, సి.కల్యాణ్ ప్యానల్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అధ్యక్షుడిగా తాను ఎన్నిక అయితే కిరీటం పెట్టరని.. పైగా తనకు సమస్యలు ఇంకా పెరుగుతాయని.. కానీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదని రాజు వ్యాఖ్యానించారు. అటు గిల్డ్‌లో ఉన్న 27 మంది సభ్యులు 1,600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారంటూ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. చిన్న నిర్మాతలను ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe