EVM Hacking Demo : ఈవీఎం ఎలా హ్యాక్‌ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్!

ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్ సింగ్. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. సాఫ్ట్‌వేర్‌ను ఎవరు ఇన్‌స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదని ఆరోపించారు.

New Update
EVM Hacking Demo : ఈవీఎం ఎలా హ్యాక్‌ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్!

EVM Hacking Demo By Congress Leader Digvijaya Singh: ఎలక్ట్రినిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(EVM) లపై మరోసారి దుమారం రేగుతోంది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) కాంగ్రెస్(Congress) మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) మరోసారి ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల విషయంలో బీజేపీ(BJP) సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా ఈవీఎంలపై అవిశ్వాసం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఈవీఎంల వినియోగం 2003లో ప్రారంభమైందని.. ఆ తర్వాత వీటిపై నమ్మకం లేక మరోసారి వీవీపీఏటీలను తెచ్చారన్నారు. VVPAT బ్యాలెట్ యూనిట్‌కు వైర్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటుందని తెలిపారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్‌కు కనెక్ట్ అవుతుందన్నారు. ఇంతకుముందు కలెక్టర్లు ఏ యూనిట్ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించేవారని.. కానీ, ఇప్పుడు దాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేసే విధానాన్ని దిగ్విజయ్ వివరించే ప్రయత్నం చేశారు. రైట్‌ టు రీకాల్‌ పార్టీ(Right To Re-Call) అధ్యక్షుడు రాహుల్‌ మెహతా దగ్విజయ్‌తో కలిసే ఉన్నారు. డమ్మీ ఈవీఎంలతో ఓటింగ్‌ను ప్రదర్శించారు.

Also Read : AP : పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరు.. పరిటాల సునీత

కేవలం ఐదు దేశాల్లోనే:
ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా(Australia) లో యంత్రంలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ పబ్లిక్ డొమైన్‌లో ఉంది. కానీ ఇప్పటి వరకు భారత్‌(India) లో ఏ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారో ఎవరికీ తెలియదు. దీన్ని పబ్లిక్ చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది. ఆర్టీఐ కింద చాలా ప్రశ్నలు అడిగారని.. వాటికి సంబంధిత సంస్థలు భిన్నమైన సమాధానాలు ఇచ్చాయని ఆరోపించారు దిగ్విజయ్.

ఈవీఎం విడిభాగాలు వేర్వేరు విక్రేతల నుంచి వచ్చాయని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. దీనికి సంబంధించి చిప్ వన్ టైమ్ ప్రోగ్రామ్ చిప్ అని సంస్థలు తెలిపాయి. కానీ, VVPAT వచ్చినప్పుడు, చిప్ బహుళ ప్రోగ్రామ్‌లతో తయారు చేశారని తెలిపారు. వీవీప్యాట్‌ను ప్రోగ్రామ్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమని రిటర్నింగ్ అధికారులు చెబుతున్నారని చెప్పారు. బీజేపీకి ఉన్న విశ్వాసం సాఫ్ట్‌వేర్‌పైనే తప్ప ప్రజలపై కాదని విమర్శించారు. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ అన్నారు. సాఫ్ట్‌వేర్ అన్నీ చేసినప్పుడు, ఎవరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో ఆ సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుందని.. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో, 90 కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశంలో, ఇలాంటి వారి చేతుల్లో ఇవన్నీ నిర్ణయించే హక్కు ఇవ్వాలా అని ప్రశ్నించారు. సాఫ్ట్‌వేర్‌(Software) ను సృష్టించి అప్‌లోడ్ చేసేది దాని యజమాని. సాఫ్ట్‌వేర్‌ను ఎవరు ఇన్‌స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదు. సాఫ్ట్‌వేర్ సృష్టికర్త, సాఫ్ట్‌వేర్ ఎవరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు దిగ్విజయ్.
Also Read :  పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరు.. పరిటాల సునీత

WATCH:

Advertisment
తాజా కథనాలు