Breaking : ప్రిన్సిపల్ సెక్రటరీకి డీఐజీ లేఖ..చంద్రబాబును కలవాలంటే ఆయన అనుమతి తప్పనిసరి..!!

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడలోని ఏసీపీ కోర్టు ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా బాబు తరపు న్యాయవాదులు కోరాు. అయితే హౌస్ రిమాండ్ ను సీఐడీ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇరుపక్షాలు కోర్టులు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. న్యాయమూర్తి తీర్పు ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో జైళ్ల శాఖ డీజీ హరీశ్ కుమార్ గుప్తా అడ్వకేట్ జనరల్ కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో వెల్లడించారు.

New Update
Breaking : ప్రిన్సిపల్ సెక్రటరీకి డీఐజీ లేఖ..చంద్రబాబును కలవాలంటే ఆయన అనుమతి తప్పనిసరి..!!

DIG's letter to Principal Secretary: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడలోని ఏసీపీ కోర్టు (ACP Court) ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా బాబు తరపు న్యాయవాదులు కోరాు. అయితే హౌస్ రిమాండ్ ను సీఐడీ (CID) తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇరుపక్షాలు కోర్టులు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. న్యాయమూర్తి తీర్పు ఇవాళ్టికి వాయిదా వేశారు.

ఈ తరుణంలో జైళ్ల శాఖ డీజీ హరీశ్ కుమార్ గుప్తా (DG Harish Kumar Gupta) అడ్వకేట్ జనరల్ కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో వెల్లడించారు.ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలతో చంద్రబాబుకు జైల్లో అన్ని రకాలు వసతులు కల్పించామని స్పెషల్ వార్డు కూడా కేటాయించామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి పరిగణలోనికి తీసుకుని స్పెషల్ బ్లాక్ శానిటైజ్ చేశామని లేఖలో పేర్కొన్నారు. బాబు ఉన్న స్నేహ బ్లాక్ కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్పెషల్ బ్లాక్ వద్ద మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన లేఖలో వెల్లడించారు.

Also Read: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు

అటు స్నేహ బ్లాక్ మొత్తం కూడా సీసీ కెమెరాలు, స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక మెడికల్ సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని లేఖలో పేర్కొన్నారు. ఏసీపీ కోర్టు జడ్జీ ఆదేశాల మేరకు అన్ని వసతులు కల్పించామని వెల్లడించారు. చంద్రబాబు అనుమతి ఇస్తేనే ఎవరైనా లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంటుందని డీజీ లేఖలో రాసుకొచ్చారు. అక్కడ 24గంటల భద్రత సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని జైళ్ల శాఖ డీజీ హారీశ్ గుప్తా స్పష్టం చేశారు.

publive-image

publive-image

Advertisment
తాజా కథనాలు