Telangana RTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్

TG: ప్రయాణికులకు RTC తీపి కబురు అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. వచ్చే నెలలోపు HYD సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను అమలు చేయనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు స్మార్ట్ కార్డు ఇవ్వనుంది.

New Update
Telangana RTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. వచ్చే నెలలోపు హైదరాబాద్ సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను అమలు చేయనుంది. ఇందుకోసం 10వేల ఐ-టిమ్ మెషీన్లను తమ సిబ్బందికి ఆర్టీసీ అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్ తో QR కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు.

ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది ఆర్టీసీ సంస్థ. చిల్లర సమస్య, లావాదేవీలలో పారదర్శకత ఉంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ప్రెమెంట్స్ అమలు చేయడం వల్ల పేపర్, ప్రింటర్ వంటి వాటికీ అయ్యే ఖర్చులు కూడా కాస్త తగ్గుతుందని ఆర్టీసీ భావించింది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మహిళలకు ప్రత్యేక కార్డు..

తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా మహిళలకు పల్లె వెలుగు, ఎక్సప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్ కార్డు ద్వారా జీరో టికెట్ ను మహిళలకు ఇస్తున్నారు. కాగా తాజాగా మహాలక్ష్మి పథకంపైన కూడా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డు ను ఇవ్వనుంది. ఆధార్ కార్డుతో ఈ కార్డును అనుసంధానం చేయనున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు