Coffee : ఫిల్టర్‌ కాఫీ.. మామూలు కాఫీ మధ్య తేడా ఏంటి?

నార్మల్‌ కాఫీ తయారీ కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. అటు ఫిల్టర్ కాఫీ సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాఫీని హాయిగా ఆస్వాదించాలనుకునే వారికి ఫిల్టర్ కాఫీ చక్కని ఎంపిక. ఇక ఈ రెండిటి మధ్య తేడాలు తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Coffee : ఫిల్టర్‌ కాఫీ.. మామూలు కాఫీ మధ్య తేడా ఏంటి?

Filter Coffee v/s normal Coffee : చాలా మంది వారి దినచర్య(Daily Routine) ను కాఫీ(Coffee) తోనే మొదలు పెడతారు. తాజా కాఫీ సువాసన నిద్ర నుంచి మేల్కొల్పడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రోజును చురుకుగా ప్రారంభించే శక్తిని కూడా ఇస్తుంది. కొంతమంది కాఫీ ప్రియులు ఉదయం పూట ఒక కప్పు క్లాసిక్ కాఫీ(Classic Coffee) ని తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు ఫిల్టర్ కాఫీ(Filter Coffee) ని ఇష్టపడతారు. ఈ రెండు కాఫీల మధ్య తేడా ఏంటో చాలా మందికి తెలియదు.

రుచి, వాసన
సాధారణ, ఫిల్టర్ కాఫీ మధ్య ముఖ్యమైన వ్యత్యాసం రుచి, వాసన. సాధారణ కాఫీ ఇన్‌స్టాంట్‌ కెఫిన్ ఇన్ఫ్యూషన్ వల్ల మామూలు రుచిగా ఉంటుంది. ఫిల్టర్ కాఫీ మాత్రం మంచి రుచి ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఇది కాఫీ గింజల సూక్ష్మ రుచి, సుగంధాలతో నిండి ఉంటుంది. ప్రతి కప్పు ఫిల్టర్ కాఫీ బీన్స్ పూర్తి సామర్థ్యాన్ని అన్వేషిస్తుంది. అయినా సాధారణ కాఫీ లాగా ఫిల్టర్ కాఫీ సువాసన సమానంగా ఉంటుంది. రిలాక్సింగ్‌గా ఉంటుంది.

తయారీ సమయం
ఈ రెండు రకాల కాఫీల మధ్య మరో ముఖ్యమైన వ్యత్యాసం తయారీకి పట్టే సమయం. సాధారణ కాఫీ తయారీని కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఇది బిజీ షెడ్యూల్‌లు ఉన్నవారికి మంచి ఎంపిక. దీనికి విరుద్ధంగా ఫిల్టర్ కాఫీ సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. తయారీ ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. దీన్ని చేయడానికి చాలా ఓపికగా వేడి నీటిని పోయాలి. దీనికి చాలా నిమిషాలు పట్టవచ్చు. కాఫీని తయారుచేసే ఈ ప్రక్రియ త్వరగా కెఫిన్ అందాలనుకునేవారికి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ కాఫీని హాయిగా ఆస్వాదించాలనుకునే వారికి ఫిల్టర్ కాఫీ చక్కని ఎంపిక. సాధారణ, ఫిల్టర్ కాఫీ ఎంపిక అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

Also Read : రిపేరుకే రెండు లక్షలు..అసలు ఈ యాపిల్ ప్రొడక్ట్ ఎంతుంటుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు