Health Tips : ఈ చిన్న తప్పే.. మిమ్మల్ని డయాబెటిస్ బాధితులుగా మార్చుతుందని మీకు తెలుసా?

మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందికి చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది.ప్రాసెస్ ఫుడ్,ఫ్రై ఫుడ్స్, తియ్యటి పానీయాలు, ప్యాక్డ్ ఫుడ్స్ వీటిని నిత్యంలో డైట్లో చేర్చుకుంటే మధుమేహం బాధితులుగా మార్చుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు

Health Tips : నేటికాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే డయాబెటిస్ (Diabetes)సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఆడ, మగ, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ వ్యాధి కనిపించడం నిజంగా ఆందోళన కలిగిస్తున్న విషయమే. మారిన జీవనశైలి(lifestyle), అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఈ దీర్ఘకాలిక వ్యాధి సమస్య(chronic disease problem)తో బాధపడుతున్నారని ఇది వరకే ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి.

మధుమేహం అంటే ఏమిటి?
మనం తినే ఆహారంలోని గ్లూకోజ్(Glucose in food) నెమ్మదిగా రక్తంలో కలిసిపోతుంది. ఇది మన శరీరంలోని ప్యాంక్రియాస్ (Pancreas) అనే గ్రంథి ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ (Insulin)ద్వారా నియంత్రించబడుతుంది. ప్యాంక్రియాస్ గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరగడం అనేది మధుమేహానికి దారితీస్తుంది.ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి, ఒక వ్యక్తికి ఒకసారి మధుమేహం వస్తే, అది ఎప్పటికీ తగ్గదు. ఆరోగ్యానికి విపరీతమైన హాని కలిగిస్తుంది. ఆరోగ్య పరిస్థితిని రోజురోజు దిగజార్చుతుంది. ప్రతి పది మందికి పరీక్షలు చేస్తే కనీసం నలుగురైదుగురికి మధుమేహం వస్తుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. చిన్న వయసులోనే ఈ వ్యాధి కనిపించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.

జన్యు, జీవనశైలి వల్ల కూడా వస్తుంది:
మధుమేహం నేడు ప్రపంచంలో అత్యంత ప్రబలమైన వ్యాధిగా మారింది. ప్రధానంగా ప్రజల జీవనశైలి, జన్యుపరమైన కారణాల వల్ల ఇది విస్తృతంగా వ్యాపిస్తోందని నిపుణులు కూడా చెబుతున్నారు.ఈ వ్యాధి 40 ఏళ్ల తర్వాత వస్తుందని గతంలో చెప్పేవారు. అయితే ఇప్పుడు కొత్తగా జన్మించిన, పాఠశాలకు వెళ్లే పిల్లలు, పెద్దలు, యువత కూడా షుగర్ బారినపడుతున్నారు. దీనికి మూలకారణం కేవలం జన్యుపరమైన కారణాలు మాత్రమే కాదు, నేడు ప్రజలు అనుసరిస్తున్న ఆహారం, జీవనశైలి కూడా.

ఇది కూడా చదవండి: రూ. 12వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభిస్తోంది ..తక్కువ డబ్బు, ఎక్కువ ఫీచర్లు..!!

టీ-కాఫీలో చక్కెర ఎక్కువ:
పంచదార లేకుండా టీ, కాఫీలను ఊహించుకోలేము. కానీ టీ, కాఫీల్లో చక్కెర ఎక్కువ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు కాఫీలు, టీలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది.

జంక్ ఫుడ్ :
ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ తినేవారు ఎక్కువయ్యారు. జంక్ రుచి బాగున్నప్పటికీ...నెమ్మదిగా అనారోగ్యం పాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జంక్ ఫుడ్ తినడం మానేయాలని ఎంత ప్రయత్నించినా..రుచి మొగ్గలు మాత్రం వాటిని కోరుకుంటాయి.వీటిని రోజూ తింటే ఆరోగ్యం చెడిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సులోనే ఊబకాయం, గుండె సమస్యలు, మధుమేహం బారిన పడటం ఖాయమని చెబుతున్నారు.

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం:
కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన జీవనశైలి, ఆహారం కూడా మనల్ని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... కొన్ని ఆహార పదార్థాలను నిరంతరం తీసుకోవడం వల్ల, రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. క్రమంగా మధుమేహం వ్యాధికి కారణం అవుతుంది. ఉదాహరణకు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ప్రాసెస్ చేసిన లేదా వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఆహారాలు, కృత్రిమంగా తియ్యటి పానీయాలు ఇవన్నీ కూడా డయాబెటిస్ కు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు