Prabhas : వరద బాధితులకు ప్రభాస్ నిజంగానే విరాళం ఇచ్చాడా? అసలు క్లారిటీ ఇదే టాలీవుడ్ హీరో ప్రభాస్ వరద బాధితులకు రూ.5 కోట్లు విరాళమిచ్చాడనే వార్త ఒకటి బయటికొచ్చింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేలింది. ఆయన 5 కోట్లు ప్రకటించినట్లు అధికారికంగా ఎక్కడా లేదు. కేవలం ఫ్యాన్స్ ఈ పుకార్లు సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు సమాచారం. By Anil Kumar 04 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Prabhas : గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ వంటి పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళమిచ్చాడనే వార్త ఒకటి బయటికొచ్చింది. అయితే ఇందులో నిజం ఏ మాత్రం లేదని తేలింది. Also Read : వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం.. ప్రభాస్ ఎంత ఇస్తారనేది ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. ఆయన 5 కోట్లు ప్రకటించినట్లు అధికారికంగా ఎక్కడా లేదు. కేవలం ఫ్యాన్స్ ఈ పుకార్లు సృష్టించి సోషల్ మీడియా అంతటా సర్క్యులేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ నిజంగా విరాళం ఇస్తే ఆయనే తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించే ఛాన్స్ ఉంది. #prabhas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి