/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-34-2-jpg.webp)
Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాదిమంది భక్తుల కల. ఈ నెల 22 నుంచి అక్కడ ఆలయంలో భక్తులకు దర్శనాలూ మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆలయ థీమ్‌తో సూరత్‌లోని కళాకారులు ఓ డైమండ్ నెక్లెస్ తయారు చేశారు. దీని కోసం వారు దాదాపు 5వేల అమెరికన్ వజ్రాలు వాడారు. దాదాపు రెండు కేజీల వెండిని ఉపయోగించి నెక్లెస్ రూపుదిద్దారు. 40 మంది కళాకారులు 35 రోజుల పాటు దీనికోసం పనిచేశారు. అయితే, ఈ ఆభరణాన్ని అమ్మకం కోసం తయారు చేయలేదని, అయోధ్య రామాలయానికి కానుకగా దానిని ఇవ్వబోతున్నామని ఆ వ్యాపారి తెలిపారు.
#WATCH | Gujarat: A diamond necklace has been made on the theme of Ram temple in Surat. 5,000 American diamonds have been used in this entire design.
The diamond necklace is made of 2 kg silver, 40 artisans completed this design in 35 days.
The diamond merchant said, “It is… pic.twitter.com/sf7jGmq1b5
— ANI (@ANI) December 19, 2023