/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sanjay-jpg.webp)
భారతీయ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గధ్వి ఆదివారం ఉదయం ముంబైలో కన్నుమూశారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు అయినటువంటి ధూమ్, ధూమ్ 2 చిత్రాలతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. సంజయ్ హఠాన్మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ధూమ్, ధూమ్ 2, సినిమాలతో పాటు మేరే యార్ కి షాది హై, తేరే లియే, కిడ్నాప్, అజబ్ గజబ లవ్ , ఆపరేషన్ పరిండే వంటి చిత్రాలకు సంజయ్ దర్శకత్వం వహించారు. ధూమ్, ధూమ్ 2 హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. సంజయ్ మృతి పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.
ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. సంజయ్ గుప్తా, కునాల్ కోహ్లీ, యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఎక్స్ ద్వారా స్పందించారు.ఆయన మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. '' ఈ వార్త నన్ను తీవ్ర దుఃఖంలోకి నెట్టేసింది. ఆయన మృతి గురించి నేను రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. యశ్ రాజ్ ఫిలింస్ లో ఎన్నో ఏళ్ల పాటు కలిసి పని చేశాం. కలిసే తిన్నాం. ఎన్నో మాటలు మాట్లాడుతకునే వాళ్లం.
వాటిని అన్నిటిని ఇప్పుడు మిస్ అవుతున్నాం. వాటన్నింటినీ ఇప్పుడు కోల్పోతున్నాను మిత్రమా..ఈ వార్తను జీర్ణించుకోవడం నా వల్ల కావడం లేదు అని దర్శకుడు కునాల్ కోహ్లీ పోస్ట్ చేశారు. అలాగే దర్శకుడు సంజయ్ గుప్తా కూడా '' చాలా త్వరగా వెళ్లిపోయావు మిత్రమా...ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే నీ ఎనర్జీని మేం మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిత్రమా అని ట్వీట్ చేశారు. . ఇక తమ బ్యానర్‌లో ‘ధూమ్’, ‘ధూమ్ 2’ సినిమాలు చేసిన సంజయ్‌కు యశ్ రాజ్ ఫిలింస్ ఎక్స్ ద్వారా నివాళి అర్పించింది.
This is beyond shocking. #SanjayGadhvi RIP never thought I’d have to write your obituary. Shared an office for many years at YRF, lunch dubbas, discussions. Will miss you my friend. This is too hard to accept. pic.twitter.com/UYUBGb1seL
— kunal kohli (@kunalkohli) November 19, 2023
Gone too soon buddy.
— Sanjay Gupta (@_SanjayGupta) November 19, 2023
Will miss your always happy energy.
Rest In Peace my friend.#SanjayGhadvi pic.twitter.com/MQp89YPD9J
also read: 89 బంతుల తర్వాత ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లీ