/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Dhatura-Plant-has-many-health-benefits-jpg.webp)
Dhatura Plant Benefits: గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభించే ఈ ఔషధ మొక్క ఆయుర్వేదంలో పురుషుల శారీరక సామర్థ్యానికి ఒక వరం. దీనినే మనకు ధాతురా అని పిలుస్తారు.దీనిని తీసుకుంటే శారీరక శక్తిని పెంచుతుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.దీనిని తినడానికి సులభమైన మార్గం లవంగాలు, జీలకర్రను సమాన పరిమాణంలో మెత్తగా రుబ్బుకోని, అందులో తేనె మిక్స్ చేసి చిన్నచిన్న మాత్రలు వేసుకోవాలి.వీటిని ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక మాత్ర వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ధాతురా మొక్క ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
రోగికి తక్షణ ఉపశమనం
- ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో ధాతురాన్ని కీళ్ల నొప్పులకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా..ధాతురా కాళ్ళలో వాపు, నొప్పి కోసం కూడా ఉపయోగిస్తారు. దీని కోసం.. ధాతురా ఆకులను మెత్తగా రుబ్బి, పేస్ట్ లాగా చేసి, పాదాలకు రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. దీని ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. దీని కారణంగా కండరాలు సహజంగా సంకోచించబడతాయి. కండరాలు మృదువుగా మారుతాయి. అంతేకాకుండా రోగికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
శారీరక సామర్థ్యం అధికం
- ఆయుర్వేద పరిశోధనా పద్ధతి ద్వారా ముఖ్యంగా వ్యాధుల చికిత్సలో వినియోగిస్తున్నట్లు ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. శాస్త్రీయ దృక్కోణంలో..పరిమిత పరిమాణంలో తీసుకుంటే ధాతుర ఔషధంగా పనిచేస్తుంది. శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో నవజాత శిశువుకు ప్రత్యేక శ్రద్ధ వహించండి.. ఇలా చేయండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ టొమాటో సూఫ్ యమ టెస్టీ గురూ!