MP Aravind: జీవన్ రెడ్డి అంకుల్.. ఇయ్యేమి దిక్కుమాలిన పనులు?!

నిజామాబాద్ ఎంపీగా నియంత అరవింద్ వద్దంటూ జగిత్యాల న్యూస్ పేపర్లలో దర్శనమిచ్చిన పాంప్లెట్లపై ధర్మపురి అరవింద్ స్పందించారు. ఆ కరపత్రాలు పంచింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని ఆరోపించారు. జీవన్ రెడ్డి అంకుల్ ఇవేమి పనులంటూ వీడియో విడుదల చేశారు.

MP Aravind: జీవన్ రెడ్డి అంకుల్.. ఇయ్యేమి  దిక్కుమాలిన పనులు?!
New Update

Telangana: నిజామాబాద్ ఎంపీగా నియంత ధర్మపురి అరవింద్ వద్దని సోమవారం తెల్లవారుజామున న్యూస్ పేపర్లలో దర్శనమిచ్చిన పాంప్లెట్లు జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ పాంప్లెట్లపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా.. జీవన్ రెడ్డి అంకుల్.. ఇయ్యేమి పనులు..? ఇసొంటి దిక్కుమాలిన ఐడియాలు మీకు ఎరిస్తున్నారని రాసుకొచ్చారు.

కరపత్రాలు పంచింది అతనే..
అలాగే ఆ వీడియోలో.. ఈ రోజు జగిత్యాలలో కరపత్రాలు పంచింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే.. అని చెప్పుకొచ్చాడు. అలాగే.. మీరు ఎక్కడ కనపడ్డ వంగి దండం పెడతా కదా.. మీకు నాలో అహంకారం ఎక్కడ కనిపించింది జీవన్ రెడ్డి అంకూల్, కండ్లకు కూలింగ్ ఉంటదని కళ్ళద్దాలు పెట్టుకుంటానని తెలిపారు. నేను అద్దాలు పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏమవుతుందని ప్రశ్నించారు. అలాగే జగిత్యాలలో బీజేపీ బలం పుంజుకోవడంతో తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.బీజేపీకి ఎప్పుడు 3వేల నుంచి 4వేల ఓట్లు వచ్చేవని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ కు దీటుగా ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏ రేంజ్ లో వస్తాయో తెలుసుకోండని సూచించారు.

ఇది కూడా చదవండి: Musi River: మూసీ నది శుద్ధి చేపట్టండి.. అధికారులకు రేవంత్ ఆదేశాలు

ఇవే చివరి ఎన్నికలు..
దీంతోపాటుగా.. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి నాకు ఇవే చివరి ఎన్నికలు అని జీవన్ రెడ్డి చెబుతూ.. రాజకీయాలను నెట్టికొస్తున్నాడని.. ఓ కథ చెప్పుకొచ్చారు. అలాగే రాజకీయంగా కొట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అంతేగాని.. ఇలాంటి చిల్లర పనులు చేయోద్దని అరవింద్ చెప్పుకొచ్చారు. చివరగా మీలాంటి వారు రాజకీయాల్లో పెద్దమనుషులు, నేను వచ్చి జీవన్ రెడ్డి వద్ద ఆశీర్వాదం తీసుకుంటానని.. ఏదైనా సరే రాజకీయంగా పోరాడుదామని.. మీ తమ్ముడికి నచ్చచెప్పాలని అరవింద్ తన ట్విట్టర్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

#dharmapuri-arvind #jeevan-reddy #jagityal #pamphlets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe