TTD: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.!

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి..ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదన్నారు. అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

New Update
TTD: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.!

TTD: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించే అవకాశమే లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. లడ్డూ బరువు, పరిమాణం ఏ మాత్రం తగ్గలేదన్న ఈవో.. రేటు తగ్గించేందుకు అవకాశం లేదన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం ఇచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒకటి ఫ్రీగా లడ్డూ అందిస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో తప్ప, మిగిలిన సమయంలో భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు పొందే సదుపాయం కల్పించామన్నారు. యువకులు శ్రీవారి సేవకులు, క్యూలైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని ఈవో పిలుపునిచ్చారు.

తిరుమలలో భక్తులకు సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న 65ఏండ్ల పరిమితిని 60ఏండ్లకు కుదించాలని చేసిన సూచనను తిరస్కరించారు. 60ఏండ్లవారుకూడా సక్రమంగా సేవలందిస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుందని ఈవో తెలిపారు. 50ఏండ్ల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి భవనాలను ఆధునీకరిస్తామని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: మళ్లీ వారణాసి నుంచే బరిలోకి ప్రధాని మోదీ..195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల.

అటు టీటీడీ పాలకమండలి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అటవీ కార్మికుల జీతాలు కూడా పెంచుతామన్నారు. అలాగే వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రూ. 3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్ లు ప్రింటింగ్ చేయనుంది. స్విమ్స్ లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు ఏర్పాటు చేస్తానన్నారు. టీటీడీలోని అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీ పై భోజన సదుపాయం..రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. సూపెర్వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం చేయనుంది. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోక్కాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని అనుకుంటుంది. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు