Raayan : ఓటీటీలోకి 'రాయన్' ఎంట్రీ అప్పుడేనా?

ధనుష్ 'రాయన్' మూవీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

New Update
Raayan : ఓటీటీలోకి 'రాయన్' ఎంట్రీ అప్పుడేనా?

Dhanush Raayan Movie : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'రాయన్' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. జులై 27న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.140 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

దీంతో ఈ సినిమా OTTలోకి ఎప్పుడు వస్తుంది అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది. త్వరలోనే 'రాయన్' ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో 'రాయన్‌' డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేయగా.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేయాలనే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

Also Read : ఎన్టీఆర్ కు జరిగింది యాక్సిడెంట్ కాదు.. అసలేమైందంటే?

దాని ప్రకారం.. ఈనెల చివరి వారంలో ఓటీటీలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, ఎస్.జే సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు