లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసే విధంగా రెచ్చగొట్టే ఎవరైనా ప్రకటనలు చేస్తే ఎవరినీ ఊరుకునేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పుంగనూరులో పోలీసులు పై అల్లరి మూకలు చేసిన దాడులను గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 80 మంది నిందితులను అరెస్ట్ చేశాం. పోలీసుల పై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ దాడులు చేసింది బయట వారా? స్థానికులా అనే అంశం గురించి విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. పోలీసు వ్యవస్థ అందరికోసం పనిచేస్తుందని రాజకీయ పార్టీలు గుర్తించి సహకరించాలి.
1.40 లక్షల మంది మహిళలు దిశా యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు 27వేల మంది మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.
విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు తగ్గింది. గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయి సాగు ఉంటే ఇప్పుడు 1000 ఎకరాల్లోనే ఉంది. నిర్దిష్టమైన ప్రణాళికలతో రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
సైబర్ నేరాలు తగ్గింపునకు ప్రతి జిల్లాలో 8 మందితో టీం ఏర్పాటు చేస్తాం. నేరస్తులు నేరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు