6 నెలల్లో 4 సార్లు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలు.. ఇండిగో తిక్క కుదిర్చిన DGCA.!!

ప్రముఖ ఎయిర్ లైన్ ఇండిగో సంస్థ కొన్ని లోపాలు ఉన్నట్లు DGCA గుర్తించింది. దీంతో ఆ సంస్థకు భారీ జరిమానా విధించింది.

New Update
6 నెలల్లో 4 సార్లు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలు.. ఇండిగో తిక్క కుదిర్చిన DGCA.!!

ప్రముఖ దేశీయ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఇండిగో కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారీ జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల కార్యకలాపాలు, ఇంజనీరింగ్ విధానాలు, ఎయిర్ పోర్టులో తరచుగా 'టెయిల్ స్ట్రైక్' సంఘటనల కారణంగా DGCA రూ. 30లక్షల జరిమానా చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ మేరకు నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈమధ్యే ఇండిగో విమానానికి చెందిన ఏ321 ఫ్లైట్ తోక భాగం రన్ వేను తాకింది. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఇలాంటి ఘటనలు 4సార్లు జరిగాయి. ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ పై DGCAస్పెషల్ ఆడిట్ చేపట్టింది. ఈ తనిఖీల్లో సంస్థ కార్యకలాపాలు, ఇంజనీరింగ్ ట్రైనింగ్, ఫ్లైట్ డేటా మానిటరింగ్ వంటి విధానాల డాక్యుమెంటేషన్ను పూర్తిగా పరిశీలించింది. ఈ డాక్యుమెంటేషన్ లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈ మధ్య ఇండిగోకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.

దీంతో ఎయిర్ లైన్స్ తమ స్పందనను DGCAకు సమర్పించింది. దీన్ని పలు స్థాయిలో పరిశీలించిన అనంతరం...డీజీసీఏ ఇండిగో వివరణతో సంత్రుప్తి చెందలేదు. ఈ క్రమంలోనే ఇండిగోకు రూ. 30లక్షల జరిమానా విధిస్తున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు డీజీసీఏ నిబంధనలు, ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మానుఫ్యాక్చరర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ డాక్యుమెంట్లను సవరించుకోవల్సిందిగా ఇండిగోను ఆదేశించింది.

ఇండిగో ప్రమాదాలు:
జూన్ 11వ తేదిన కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు ఫ్లైట్ తోకభాగం రన్ వేపై తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైలెట్లు ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో దాని సర్వీసులు నిలిపివేశారు అధికారులు.

జనవరి 21,2022న గగనతలంలో రెండు ఫ్లైట్స్ ఒకదానికొకటి చేరువగా రాబోయి...రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఇండిగో సంస్థకు చెందిన ఈ రెండు విమానాల్లో ఒకటి బెంగళూరు నుంచి కోల్ కత్తాకు వెళ్లేందుకు టేకాప్ కాగా..ఇంకోటి భవనేశ్వర్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. 5నిమిషాల తేడాతో టేకాఫ్ అయిన ఈ రెండు ఫ్లైట్లలను రాడార్ కంట్రోలర్ అప్రమత్తంచేసి ప్రమాదాన్ని నివారించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు