ప్రత్యేక దర్శనాలు..
స్వయంగా స్వామిజీ తమ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న జనం ఒక్కసారిగా దర్శనానికి తండోపతండాలుగా అక్కడికి చేరుకోవడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది స్వయం ప్రకటిత స్వామీజీని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో భక్తుల్లో గందరగోళం మొదలైంది. ఇంతకీ ఎవరీ స్వయం ప్రకటిత స్వామిజీ? ఎందుకు ఈయన కోసం భక్తులు తండోపతండాలుగా ఎగబడ్డారు? ఈయన ఎక్కడ దర్శనమిచ్చారు? అనే వివరాళ్లోకి వెళ్తే… తమిళనాడుకు చెందిన సురుష్ కుమార్ అనే వ్యక్తి తనకు తాను సర్వాంతర్యామినని, తానే భగవంతుడినని ప్రకటించుకోవడం జరిగింది. ఇతనికి ఇద్దరు భార్యలు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా స్వామిజీ అవతారం ఎత్తిన సురేష్ కుమార్ తమిళనాడులో అనేక మందిని భక్తులను ఆకట్టుకుంటూ వారికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు.
ఆనోట..ఈనోటతో వైరల్..
ఆయనకు కేటిదొడ్డిలో పాగుంఠ వెంకటేశ్వరస్వామి కమాన్ దగ్గర ఉన్న పోలం దగ్గర కుర్చున్నాడు. తనకు అక్కడ స్థలం ఉందని, అది తనకు ఇవ్వాలని స్వామిజీ నిరసన తెలుపుతూ అక్కడ కూర్చున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న ఆయన భక్తులు గమనించి తమ స్వామివారు తమ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యారని చెప్పుకుంటూ ఆయన చుట్టూ చేరారు. ఆ నోట ఈ నోట తెలంగాణలోని భక్తులందరికి సమాచారం అందింది.ఇక ఆయన భక్తులు పెద్ద సంఖ్యలో స్వయం ప్రకటిత సురేష్ కుమార్ స్వామిజీని దర్శించుకోవడం కోసం బారులు తీరారు. అది రాయచూర్ వెళ్లే జాతీయ రహదారి కావడంతో వచ్చిన భక్తులు రోడ్డుపై బారులు తీరడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు ఐదారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. భక్తులను చెదరగొట్టిన కేటిదొడ్డి పోలీసులు స్వయం ప్రకటిత సురేష్ కుమార్ స్వామిజీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
భక్తుల తాకిడితో ట్రాఫిక్ అంతరాయం
దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. స్వయం ప్రకటిత స్వామిజీ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఆయన జోగులాంబ జిల్లాకు ఎందుకు వచ్చారు.. ఆయనకు ఇంతమంది భక్తులెలా సాధ్యమనేది విచారిస్తున్నారు. మొత్తానికి స్వయం ప్రకటిత సురేష్ కుమార్ స్వామిజీగా జోగులాంబ జిల్లాలో దర్శనమిచ్చి సంచలనం రేపారు. మరి ఆయన ఏ మేరకు సర్వాంతర్యామినో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.