మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్న దేవినేని ఉమా

టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటన మూడోరోజు మైలవరం పట్టణంలో కొనసాగుతోంది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దేవినేని ఉమా. పెద్ద హరిజనవాడ, శాంతినగర్, బాలయోగి నగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు దేవినేని ఉమా మరియు పార్టీ శ్రేణులు.

New Update
మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్న దేవినేని ఉమా

Devineni Uma taking the Mini Manifesto to the masses

ఎమ్మెల్యే పనితీరుపై ఆగ్రహం

మైలవరం హరిజనవాడ చూస్తే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం అవుతుందన్నారు దేవినేని ఉమా. అధ్వానంగా పారిశుద్ధ్యం .. ఐదు రోజుల నుంచి మంచినీళ్లు లేవు పట్టించుకునే నాధుడు లేడు మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ఇంటింటికి కుళాయి టీడీపీ హయాంలో కొండపల్లిలో పనులు చేసి నీళ్లు ఇచ్చి చూపిస్తే వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చి వాటిని పాడుపెట్టారని మండిపడ్డారు. పారిశుద్ధ్య లోపంతో జ్వరాలు అనారోగ్యం పాలై మనుషులు దూరం అవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.151 సీట్లు వచ్చాయి.. పంచాయతీలు, మండలాలు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు గెలిచామని జబ్బలు చరుచుకుంటూ తొడలు కొట్టుకుంటున్నారే తప్పా రాష్ట్రం ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం సీఎం జగన్‌కి కనపడటం లేదన్నారు.

దోచుకుంటున్నారు..

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఊరికో సామంతుడిని అప్పజెప్పాడు ... వాళ్లు ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు దోచుకుంటూ జోబులు నింపుకుంటున్నారు. సచివాలయ బిల్డింగులు కట్టుకోవడానికి సోకులు చేసుకోవటానికి ప్రభుత్వం పరిమితం అయిపోయిందన్నారు.ఇప్పటికైన అధికారులు.. ప్రజాప్రతినిధులు.. కళ్ళు తెరవాలి రాష్ట్రంలో జరుగుతున్న ఆగడాలను ఆరికట్టాలని దేవినేని విజ్ఞప్తి చేశారు.

ప్రజల సమస్యలపై పోరాటం

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా మైలవరం పట్టణంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించనున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకోమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొనాలని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం కోరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు