TDP Devineni Uma: ఫినాయిల్ తో కడిగినా మీ నోరు బాగుపడదు.. కొడాలి నాని, కేశినేని లపై దేవినేని ఉమా సెటైర్లు..! ఫినాయిల్ తో కడిగితే డ్రైనేజీ బాగుపడుతుందేమో కానీ కొడాలి నాని నోరు బాగుపడదని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేశినేనికి లేదని.. అంబటిలా డ్యాన్సులు వేసుకోమని కౌంటర్లు వేశారు. By Jyoshna Sappogula 19 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP Devineni Uma Maheswara Rao: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కొడాలి నాని, కేశినేని నాని లకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీతక్కలను చూసి నానీలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి కొడాలి నానికి గుడివాడ సెంటర్లో ప్రజలు పట్టిస్తారని అన్నారు. గుడివాడలో రా కదలిరా సభ బ్రహ్మాండంగా విజయవంతం అవ్వడంతో బడుద్దాయి కొడాలి నాని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని కామెంట్ చేశారు. పరువు ప్రతిష్టలు తీశావు.. ఇసుక, మట్టి, వందల కోట్లు దోచేసి.. క్యాసినోతో గుడివాడను గోవా చేసిన కొడాలి నాని కృష్ణా జిల్లా పరువు ప్రతిష్టలు తీశాడని విమర్శలు గుప్పించారు. రెండుసార్లు చంద్రబాబు బూట్లు నాకి బీఫారం తెచ్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫినాయిల్ తో కడిగితే డ్రైనేజీ బాగుపడుతుందేమో కానీ కొడాలి నాని నోరు బాగుపడదని కౌంటర్ వేశారు. బుద్ధ వెంకన్న పంపించిన మందులు బొడ్డు చుట్టూ పొడిపించుకో అంటూ ఎద్దెవ చేశారు. నువ్వు దోచుకున్న అవినీతి డబ్బులను కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడిన లుచ్చా భాషకు కచ్చితంగా సమాధానం చెప్తామని ఫైర్ అయ్యారు. Also Read: మంత్రి పినిపే విశ్వరూప్ కు షాక్.. అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగ..! డాన్సులు వేసుకో.. పార్టీ రంగు మారగానే కేశినేని నానికి పోలవరం ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందని.. వారం రోజుల్లో దుర్మార్గులు ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నాడని మండిపడ్డారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత నానికి లేదని.. అంబటి రాంబాబు డాన్సులు వేస్తున్నాడు నువ్వు కూడా అతనితో పాటు డాన్సులు వేసుకో అని చురకలు వేశారు. పోలవరం అనుమతులు తీసుకొచ్చాను అంటున్నావు.. ఇంకా నయం నేను తీసుకొచ్చాను అనలేదు.. ఈ పార్టీలో ఉండగా సామెతలు గుర్తు రాలేదా ? అని ప్రశ్నించారు. పారిపోవడానికే .. రెండుసార్లు బీఫామ్ తీసుకొని పార్టీ దగ్గర ఆర్థిక సహాయం తీసుకుని టీడీపీ శాసనసభ అభ్యర్థుల రెక్కల కష్టంతో గెలిచి కార్యకర్తలు, నాయకులు గుండెల మీద తన్ని పరాయి పార్టీ పంచన చేరావని ధ్వజమెత్తారు. పార్టీ మార్చి, రంగులు, జెండాలు మార్చి కేశినేని నాని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో మీ రాజకీయ వ్యభిచారం ఏంటో ప్రజలు తెలుస్తారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పారిపోవడానికి వైసీపీ నేతలు అంతా విశాఖపట్నంలో సింగపూర్ విమానం పెట్టుకున్నారని కామెంట్స్ చేశారు. #ex-minister-kodali-nani #kesineni-nani #devineni-uma-maheshwar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి