/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-17.jpg)
Devara Chuttamalle Song : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. సెప్టెంబర్ 27 న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా సెకెండ్ సింగిల్ 'చుట్టమల్లే' మెలోడీ ట్రాక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా సాంగ్ లో తారక్ - జాన్వీ ల కెమిస్ట్రీ, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన నాటి నుంచి మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో అదికూడా ఓన్లీ తెలుగు వెర్షన్ 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది.
#ChuttaMalle is a celebration of love sweeping across all the charts ❤️🔥❤️🔥
100 Million+ views and ruling YouTube Music trending list 💥💥https://t.co/WoAQqjRA87
An @AnirudhOfficial Musical 🎶#Devara #DevaraSecondSingle pic.twitter.com/L80IRulxqp
— Devara (@DevaraMovie) September 3, 2024
#Chuttamalle Telugu Lyrical Song From @DevaraMovie Hits 100 Million Views On @YouTube In Single Channel In Just 28 Days 21Hrs 45Min
2nd Fastest Telugu Lyrical Video To Hit 100M Views On YouTube#Devara #DevaraSecondSingle#DevaraOnSep27th @tarak9999#ChuttamalleHits100MViews pic.twitter.com/UaoTS6RXtr
— NTR Trends (@NTRFanTrends) September 3, 2024
Also Read : శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్.. అదిరిపోయిన ‘విశ్వం’ టీజర్
అంతేకాదు ఈ సాంగ్ నాలుగు వారాలుగా మోస్ట్ ట్రెండింగ్ జాబితాలో కొనసాగుతుండటం విశేషం. ఇదే విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ సెప్టెంబర్ 4న విడుదల కానుంది.