OTT : ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం 'అబ్రహామింతే సంతాతికల్' ఆరేళ్ల తర్వాత ఓటీటీ లోకి రాబోతుంది. తెలుగులో 'డెరిక్ అబ్రహాం' పేరుతో స్ట్రీమింగ్ కానుంది. 'ఆహా' లో ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. By Anil Kumar 09 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Derick Abraham Movie Is Coming On OTT Platform : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటించిన మలయాళ చిత్రం 'అబ్రహామింతే సంతాతికల్'. ఈ చిత్రం 2018లో మలయాళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుమారు రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.45 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. క్రైం ఇన్వెస్ట్ గేషన్ (Crime Investigation) కథాంశంతో రూపొందిన ఈ సినిమా మలయాళ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. షాజీ పాడూర్ డైరెక్ట్ చేసిన ఈ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మమ్ముట్టి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్యల కేసును డెరిక్ అబ్రహాం ఎలా సాల్వ్ చేసారనే ఆసక్తికర పాయింట్ తో సాగనున్న ఈ సినిమా దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీ లోకి రాబోతుంది. Also Read : పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ లో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్..! తెలుగులో 'డెరిక్ అబ్రహాం' (Derick Abraham) పేరుతో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' లో ఈ మూవీ ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది . ఈ మేరకు 'ఆహా' ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. #mammootty #derick-abraham-movie #crime-investigation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి