AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్‌ కు ఎంపీ మిథున్‌ రెడ్డి సవాల్..!

ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేశారు. పవన్ విమర్శలపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్‌ విసిరారు.

AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్‌ కు ఎంపీ మిథున్‌ రెడ్డి సవాల్..!
New Update

Pawan V/s Mithun Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని ఆరోపించారు.పెద్దిరెడ్డి బండ్లు అంటే చాలు అధికారులు ఆపేవారు కాదని కామెంట్స్ చేశారు.

Also Read: ASI నిర్వాకం.. కేసు పక్కన పెట్టి మందు బాబులతో చిందులు.!

అయితే, పవన్‌ కల్యాణ్‌ విమర్శలకు పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్‌ విసిరారు. దీక్షలో ఉండి పవన్‌ కల్యాణ్‌ అలవోకగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని నిలదీశారు.

Also Read: బెంగుళూర్‌లో మాజీ సీఎం డిఫరెంట్ లుక్‌.. తొమ్మిది రోజుల తర్వాత..

ఇప్పుడే కాదు.. పాతిక సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమరవాణాపై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. చివరకు సత్యశోధన పరీక్షకైనా తాను రెడీ అన్నారు. ఐదేళ్లపాటు మీకు సమయం ఉంది.. ఆరోపణలను నిరూపించలేకపోతే బహిరంగంగా మీరు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా? అంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

#mp-mithun-reddy #deputy-cm-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe