Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

AP: గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిలిపివేసిందని చెప్పారు. గతంలో జరిగిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు.

New Update
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan:గత ప్రభుత్వం నిర్వహణ లోపంతో పంచాయతీలకు అనేక ఇబ్బందులు తలెత్తాయని అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిలిపివేసిందని చెప్పారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వివరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించలేదని అన్నారు.

పంచాయతీ ఎన్నికలు నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యమైందని చెప్పారు. గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏకీకృతం చేయలేదని ఆరోపించారు. ఎవరి అనుమతి లేకుండా 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత గత ప్రభుత్వం ఆర్థిక శాఖ డిస్కంలకు పంపేసిందని చెప్పారు. దీనిపైన ప్రత్యేకంగా 4, 5 గంటలు చర్చ జరగాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు