Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ కీలక ప్రెస్‌మీట్.. రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ!

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు విలేకర్లతో సమావేశం కానున్నారు. కాగా ఉదయాన్నే పవన్ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక కారణం ఏమైవుంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.

New Update
Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ కీలక ప్రెస్‌మీట్.. రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ!

Pawan Kalyan: ఈరోజు 10.30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ఉదయాన్నే పవన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి కారణమేంటి?, ప్రెస్‌మీట్‌లో పవన్ ఏం చెప్పబోతున్నారు!, చేసిన, చేయాల్సిన అభివృద్ధి పనులపై మాట్లాడుతారా?, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిల ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆరోపణలపై ఆధారాలు బయటపెడుతారా! అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థి వంగా గీత సవాల్ చేశారు. ఆరోపణలు కాదు, ఆధారాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వంగా గీత సవాల్‌ను పవన్‌ స్వీకరించారా? లేదా?.. పవన్‌ ప్రెస్‌మీట్‌పై వైసీపీ, కూటమి నేతల్లో ఆసక్తి నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు