AP: వారిపై చర్యలు తీసుకోండి.. పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం సీరియస్.!

పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. కృష్ణా కరకట్టపై రికార్డులను దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

New Update
AP: వారిపై చర్యలు తీసుకోండి.. పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం సీరియస్.!

Pawan Kalyan: పొలూష్యన్ కంట్రోల్ బోర్డు(PCB) ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు.

Also Read: బాలికపై మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు..!

ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read: కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులు..!

విజయవాడ అవనిగడ్డ కరకట్టపై ప్రభుత్వ పైళ్లు దహనం చేశారు. బస్తాలకొద్దీ ఫైళ్లను తగలబెట్టారు. మైనింగ్‌శాఖకు చెందిన రికార్డులు ధ్వంసం అయ్యాయి. యనమలకుదరు కట్ట రోడ్డు వెంట సిబ్బంది రికార్డులు తగలబెట్టారు. విషయం వెలుగులోకి రావడంతో డిప్యూటీ సీఎం మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు