Bhatti Vikramarka: బ్యాంకులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

TG: బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతుల ఖాతాల్లో వేస్తున్న డబ్బులు రుణమాఫీ కోసమే వాడాలని బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని అన్నారు. ఆగస్టు దాటాక ముందే రూ.2 లక్షల మాఫీ జరుగుతుందని చెప్పారు.

New Update
Bhatti Vikramarka: బ్యాంకులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

Deputy CM Bhatti Vikramarka: ప్రజా భవన్ లో బ్యాంకర్స్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు.ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు భట్టి విక్రమార్క. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు మరియు ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు రుణభారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రక్రియతో రైతుల ఖాతాల్లో వేస్తున్న డబ్బులు రుణమాఫీ కోసమే వాడాలని బ్యాంకు అధికారులకు సూచించారు. గతంలో రుణమాఫీకి కాకుండా వేరే ఇతర లోన్లకు, వడ్డీకి ఆ డబ్బును పట్టుకొని రైతులను ఇబ్బందికి గురి చేయకుండా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రుణమాఫీ నిర్ణయం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. వారి సంతోషానికి బ్యాంకులు అడ్డం పడొద్దని అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని అన్నారు. ఆగస్టు దాటాక ముందే రూ.2 లక్షల మాఫీ జరుగుతుందని చెప్పారు. 11 లక్షల రైతులకు ఇవాళ మాఫీ జరుగుతుందని అన్నారు.

Advertisment
తాజా కథనాలు