/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kidsmh-jpg.webp)
Mental Health: కొంత మంది పిల్లలు చిన్న వయసులోనే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు గురవుతారు. దాని వల్ల ఎప్పుడు చిరాకుగా ఉండడం, రకరకాల భావాలను వ్యక్త పరచడం, అందరితో కలవకుండా బాధగా, ఒంటరిగా ఉండడం చేస్తుంటారు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు త్వరగా గుర్తించి.. దానికి తగిన ట్రీట్మెంట్ చేయించాలి. లేదంటే పిల్లల ఎదుగుదల పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
పిల్లలు డిప్రెషన్ లో ఉన్నట్లు తెలిపే లక్షణాలు..
- డిప్రెషన్ తో బాధపడే పిల్లలు ఏ పని పై శ్రద్ధ చూపకుండా ఒంటరిగా కూర్చోవడం.. స్నేహితులతో కలవలేకపోవడం వంటివి చేస్తుంటారు. పిల్లల్లో ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు త్వరగా దానికి సంబంధించిన కారణాలను తెలుసుకొని నిపుణుల సలహాలను తీసుకోవడం మంచింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pexels-files-4145365-scaled.webp)
- పిల్లలు ఎప్పుడు చిరాకు, బాధ.. ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. ఇవి కూడా డిప్రెషన్(నిరాశ) లక్షణాలు. పిల్లలు ఇలా కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
- కొంత మంది పిల్లల్లో తినే ఆహారపు అలవాట్లలో, అలాగే నిద్రించే సమయంలో కూడా మార్పులు వస్తుంటాయి. ఇవి కూడా పిల్లలు డిప్రెషన్ తో బాధపడుతున్నారని తెలిపే లక్షణాలు. అంతే కాదు కొన్ని సార్లు తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pexels-rdne-stock-project-6003561-scaled.webp)
- డిప్రెషన్ తో బాధపడే పిల్లలు చదువు పై కూడా శ్రద్ధ చూపలేకపోవడం వల్ల మార్కులు కూడా తక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొంతమంది పేరెంట్స్ దానికి కారణమేంటని తెలుసుకోకుండా వదిలేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదం.. కొన్ని సార్లు పిల్లల్లోని మానసిక సమస్య కూడా దీనికి కారణమయ్యే అవకాశం ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pexels-rdne-stock-project-6936476-scaled.webp)
- మానసిక సమస్యతో బాధపడే పిల్లలు.. మిగతా పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడకపోవడం, అనవసరంగా కోప్పడడం, అరవడం, చికాకుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. పిల్లలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pexels-mikhail-nilov-7929419-scaled.webp)
Image Credits: Pexel
Also Read: Winter Foods: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..!
Follow Us