Dengue: డెంగీ, గుండె జబ్బుకు సంబంధం.. పరిశోధనలో ఏం తెలిందో తెలుసా...?

దోమ కాటు వల్ల డెంగీ వస్తుంది. తాజాగా చేసిన పరిశోధనలో డెంగీ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని తేలింది. డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి, శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dengue: డెంగీ, గుండె జబ్బుకు సంబంధం.. పరిశోధనలో ఏం తెలిందో తెలుసా...?
New Update

Dengue: ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మామూలుగా ప్రతి సంవత్సరం ఈ సీజన్లో డెంగీ కేసులో ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఈ డెంగీ కేసులు ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసి అవకాశం ఉంది. తాజాగా చేసిన పరిశోధనలో డెంగీ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డెంగీ వల్ల హృద్రోగులకు ఎక్కువ ప్రమాదం ఉందట. దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. డెంగీ కారణంగా ఒక వ్యక్తికి అధిక జ్వరం వచ్చి, శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రోగి చనిపోవచ్చు. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

డెంగీ వల్ల గుండె జబ్బులు వస్తాయా..?

దేశంలో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. దీనిని ప్రధాన కారణం కోవిడ్-19గా చెబుతున్నారు. కోవిడ్ -19 తర్వాత గుండెపోటు కేసులు పెరిగాయి. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఈ జ్వరం రక్తంలో గడ్డకట్టడానికి కారణమవుతుంది. దీని కారణంగా గుండె ధమనులలో అడ్డుపడటం ప్రారంభమవుతుంది. అయితే కోవిడ్-19 కంటే డెంగీ మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. డెంగీ తర్వాత గుండె ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ పరిశోధన ప్రకారం.. డెంగీ భవిష్యత్త్‌లో అనేక విధాలుగా శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అనేక సందర్భాల్లో తీవ్రమైన డెంగీ కాలేయం దెబ్బతినడం, మయోకార్డిటిస్, నరాల సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#dengue
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe