Alaska: డబ్బు ఆశతో ఓ యువతి దారుణానికి పాల్పడింది. మర్డర్ లైవ్ వీడియో పంపిస్తే లక్షల్లో డబ్బులు ఇస్తానని ఓ వ్యక్తి ఆఫర్ చేయగా.. తన బెస్ట్ ఫ్రెండ్ నే అతికిరాతంగా చంపేసింది. విహారయాత్ర పేరుతో బయటకు తీసుకెళ్లిన ఆమె స్నేహితురాలిని నమ్మించి వెనకనుంచి తలపై తుపాకితో కాల్పులు జరిపింది. ఈ ఘటన 2019లో ఉత్తర అమెరికాలోని అలెస్కాలో చోటుచేసుకోగా నిందుతురాలికి 99 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం.
ఇద్దరు మంచి స్నేహితులు..
ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సింథియా హాఫ్ మన్ (Cynthia Hoffman), డెనాలి బ్రేమర్ (Denali Brehmer) ఇద్దరు మంచి స్నేహితులు. అయితే ఒక రోజు అనుకోకుండా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో లైవ్ మర్డర్ వీడియో పంపిస్తే $9M ఇస్తానని డెనాలికి ఆఫర్ చేశాడు. ఈ క్రమంలోనే సింథియా హాఫ్ మన్ ను(19) టూర్ పేరుతో బయటకు తీసుకెళ్లి లైవ్ వీడియో పెట్టి 2019లో తలపై కాల్చి చంపింది బెనాలి. దీంతో హాఫ్‌మన్ మరణానికి సంబంధించి అనేక మందిపై హత్యా నేరం మోపబడింది. ఈ క్రమంలో 2023లో కేసు విచారణలో హత్య చేసినట్లు 24 ఏళ్ల డెనాలి నేరాన్ని అంగీకరించినట్లు అలస్కా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా తెలిపింది.
ఇది కూడా చదవండి : Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నది ఒడ్డున డెబ్ బాడీ..
2019 జూన్ లో అలాస్కాలోని చుగియాక్‌లోని థండర్‌బర్డ్ జలపాతం వద్ద డెనాలితో కలిసి విహారయాత్ర చేస్తున్నప్పుడు హాఫ్ మన్ తప్పిపోయింది. రెండు రోజుల తరువాత ఆమె డెబ్ బాడీ నది ఒడ్డున కనిపించింది. ఆమె తల వెనుక భాగంలో తుపాకీ గాయం ఉంది. డెనాలి కాన్సాస్‌కు చెందిన మిలియనీర్ అని చెప్పుకునే 'టైలర్' అనే వ్యక్తితో ఆన్‌లైన్ రిలేషన్‌షిప్‌లో ఉందని, ఒకరిని చంపడానికి లేదా నేరానికి సంబంధించిన ఫొటో, వీడియోలను అతనికి పంపడానికి ఆమెకు $9 మిలియన్లను ఆఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నందున మరో ఇద్దరు టీనేజర్లను జువైనల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేసినట్లు యాంకరేజ్ డైలీ న్యూస్ వెల్లడించింది.