Dementia Treatment: క్యాన్సర్..టీబీ.. ఇలాంటి వ్యాధుల కన్నా.. మనిషికి బ్రతికి ఉండగానే నరకప్రాయమైన జీవితాన్ని ఇచ్చే వ్యాధి ఒకటి ఉంది. అది డెమెన్షియా(dementia) తెలుగులో చెప్పుకోవాలంటే చిత్తవైకల్యం. ఈ వ్యాధికి చికిత్స లేదు. మనిషి తన జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయి.. తానేం చేస్తున్నాడో ఇంకా చెప్పాలంటే తానెవరో తెలియని స్థితికి వెళ్లిపోవడమే ఈ వ్యాధి చేసే పని. ఈ వ్యాధికి సంబంధించి తాజాగా వస్తున్న వార్తలు కాస్త ఆశను కల్పిస్తున్నాయి. ఈ చిత్తవైకల్యానికి వచ్చిన తరువాత మందేమీ లేదు కానీ, రాకముందే దీనిని నియంత్రించే అవకాశం ఉందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. అల్జీమర్స్ అనేది ఈ చిత్తవైకల్యం సూచించే ఒక వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీనికిని ముందుగా కనిపెట్టే పరిస్థితి ఇంతవరకూ లేకపోవడం వలన సరైన మెడిసిన్ కనిపెట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే, ఈమధ్య వార్విక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మంచి పురోగతి కనిపించింది. రక్త పరీక్ష ద్వారా కనీసం 15 సంవత్సరాల ముందే ఈ వ్యాధి రావడానికి ఉండే అవకాశాలను తెలుసుకోవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జియాన్‌ఫెంగ్ ఫెంగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో చేసే రక్త పరీక్షతో భవిష్యత్ లో చిత్తవైకల్యం వచ్చే అవకాశాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. ఇది ఎంతోమందికి మేలు చేస్తుంది అన్నారు.
ఈ పరిశోధనలకు సంబంధించి జనవరిలో ప్రచురించబడిన ట్రయల్ ఫలితాల్లో p-tau217 అనే ప్రోటీన్ స్థాయిల ఆధారంగా చిత్తవైకల్యం వచ్చే అవకాశం అలాగే అప్పటికే వచ్చిన విషయం అంతేకాకుండా ఇది వచ్చే అవకాశం లేదు అనే విషయాల్ని నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికోసం యూకేలో చేస్తున్న రక్తపరీక్షలు ఎటువంటివి అనేదానిపై క్లారిటీ అయితే రాలేదు కానీ.. మొత్తమ్మీద ఇంతకాలం కొరకరాని కొయ్యగా కనిపించిన చిత్తవైకల్యానికి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసలు ఏమిటీ డెమెన్షియా
చిత్తవైకల్యం(డెమెన్షియా) అనేది ఒక నిర్దిష్ట వ్యాధి కాదు, ఇది రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే గుర్తుంచుకోవడం, ఆలోచించడం లేదా నిర్ణయాలు తీసుకునే బలహీనమైన సామర్థ్యానికి సంబంధించిన సాధారణ పదం. అల్జీమర్స్ వ్యాధి చిత్తవైకల్యానికి సంబంధించిన అత్యంత సాధారణ రకం. చిత్తవైకల్యం ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేసినప్పటికీ, ఇది సాధారణ వృద్ధాప్యంలో భాగం కాదు.
చిత్తవైకల్యం సాధారణ ప్రారంభ లక్షణాలు
- జ్ఞాపకశక్తి కోల్పోవడం.
- ఏకాగ్రత కష్టం.
- షాపింగ్ చేసేటప్పుడు సరైన మార్పు గురించి గందరగోళం చెందడం వంటి సుపరిచితమైన రోజువారీ పనులను నిర్వహించడం కష్టం.
- సంభాషణను అనుసరించడానికి లేదా సరైన పదాన్ని కనుగొనడానికి కష్టపడుతున్నారు.
- సమయం మరియు ప్రదేశం గురించి గందరగోళంగా ఉంది.
- మానసిక స్థితి మారుతుంది.
Also Read: డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది!
చిత్తవైకల్యం ఎలా వస్తుందంటే..
ఇది (Dementia Treatment)అమిలాయిడ్ ఫలకాలు- టౌ టాంగిల్స్ అని చెప్పుకునే ప్రోటీన్ల అసాధారణ నిర్మాణాలతో సహా మెదడులో మార్పుల వలన సంభవిస్తుంది . ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా, 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో వచ్చే చిత్తవైకల్యం అరుదైన రూపం. ఇది టౌ - TDP-43 ప్రోటీన్‌ల అసాధారణ మొత్తాలు లేదా రూపాలతో సంబంధం కలిగి ఉంటుంది.
నివారణ ఉందా?
చిత్తవైకల్యానికి (Dementia Treatment)ప్రస్తుతం "నివారణ" లేదు . వాస్తవానికి, చిత్తవైకల్యం వివిధ వ్యాధుల వల్ల వస్తుంది కాబట్టి చిత్తవైకల్యానికి ఒకే చికిత్స ఉండే అవకాశం లేదు. అల్జీమర్స్ వ్యాధి, ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా, లెవీ బాడీలతో చిత్తవైకల్యం వంటి చిత్తవైకల్యం కలిగించే వ్యాధులకు నివారణలను కనుగొనడంపై ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చిత్తవైకల్యాన్ని ఎలా నివారించడానికి ప్రత్యేకమైన మార్గం ఏదీ ప్రస్తుతం లేదు. అయితే, కొన్ని అలవాట్ల ద్వారా ఇది వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అవి..
- సమతుల్య ఆహారం తినడం.
- ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం.
- క్రమం తప్పకుండా వ్యాయామం.
- సిఫార్సు చేయబడిన పరిమితుల్లో మద్యం ఉంచడం.
- ధూమపానం ఆపడం.
- మీ రక్తపోటును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడం.
Watch this Interesting Video :