Demat Accounts: భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య మనదేశంలో భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన డీమ్యాట్ ఎకౌంట్స్ సంఖ్య బీహార్ వంటి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలలో బాగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 28 Apr 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి స్టాక్ మార్కెట్‌లో వృద్ధి అలాగే స్థిరత్వాన్ని తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలు(Demat Accounts) ఒక సంవత్సరంలో 4.03 కోట్లు (31.23%) పెరిగాయి. వీరిలో 1.28 కోట్ల మంది (32.16%) కొత్త పెట్టుబడిదారులు బీహార్, మధ్యప్రదేశ్ (MP), రాజస్థాన్ -ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు. ఇవి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు అలాగే, 'అనారోగ్య' రాష్ట్రాల కేటగిరీలో ఉన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలతో పోలిస్తే సంపన్నమైనవిగా పరిగణిస్తున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో వంటి రాష్ట్రాలలో కేవలం 52.10 లక్షల (12.92%) రిటైల్ పెట్టుబడిదారులు(Demat Accounts) మాత్రమే పెరిగారు. ఇది కూడా చదవండి: థియేటర్ లో సినిమా.. ఆ కిక్కే వేరబ్బా అంటున్న జనం.. ఈ లెక్కలపై ఓ లుక్కేయండి! యూపీలో ఒక్క ఏడాదిలో 57.24 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు(Demat Accounts) చేరారు. దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం పెట్టుబడిదారుల సంఖ్య 1.81 కోట్లకు పెరిగింది. మహారాష్ట్ర తర్వాత అత్యధిక స్టాక్ ఇన్వెస్టర్ల(Demat Accounts) జనాభా కలిగిన రాష్ట్రంగా గుజరాత్‌ను అధిగమించింది. మహారాష్ట్రలో మొత్తం 3.19 కోట్ల మంది పెట్టుబడిదారులు ఉన్నారు. గుజరాత్‌లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంఖ్య 1.60 కోట్లు. కేరళలో ఒక్క ఏడాదిలో కేవలం 7.08 లక్షల మంది మాత్రమే పెట్టుబడిదారులు(Demat Accounts) పెరిగారు. కర్ణాటకలో గత ఏడాది కాలంలో 19.02 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లోకి చేరారు. అయితే, మహారాష్ట్రలో దీని సంఖ్య 62.64 లక్షలుగా ఉంది. 3 సంవత్సరాలలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య మూడు రెట్లు.. మూడు సంవత్సరాలలో డిమ్యాట్ ఖాతాలసంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2021లో వారి సంఖ్య 5.44 కోట్లు కాగా అది 16.96 కోట్లకు పెరిగింది. మెహతా ఈక్విటీస్ డైరెక్టర్ ప్రశాంత్ బన్సాలీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ- రానున్న 12 నెలల్లో 20 కోట్ల డీమ్యాట్ ఖాతాల(Demat Accounts)ను చేరుకునే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. సెన్సెక్స్ లో పెరుగుదల.. గత ఏడాది కాలంలో సెన్సెక్స్‌లో 20 శాతం వృద్ధి నమోదైంది. ఒక సంవత్సరం క్రితం అంటే 28 ఏప్రిల్ 2023న, సెన్సెక్స్ 61,112 పాయింట్ల వద్ద ఉంది, ఇది ఇప్పుడు 73,730 పాయింట్లకు చేరుకుంది, అంటే 28 ఏప్రిల్ 2024న. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో దీని పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. #stock-market #demat-account మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి