AP: జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్: AISF

నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన AISF విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చింది. పరీక్ష పేపర్లు వరుసగా లీకేజీ అవుతున్న ఎందుకు ఎన్‌టిఏని ప్రక్షాళన చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. నీటి పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

AP: జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్: AISF
New Update

Tirupati: నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్ కి ఏఐఎస్ఎఫ్ పిలుపునిస్తున్నట్లు, జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజు పేర్కొన్నారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య( ఏఐఎస్ఎఫ్) జాతీయ సమితి సమావేశాలు రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు, సమస్యలపై చర్చించి తీర్మానించడం జరిగిందన్నారు ప్రధాన కార్యదర్శి దినేష్.

Also Read: దయనీయంగా రైతుల పరిస్థితి.. 250 మంది ఆత్మహత్య..!

జాతీయ సమితిలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన మీడియాకు వివరించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాల పేపర్ లీకేజీ 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షపేపర్ల లీకేజీపై పార్లమెంట్లో చర్చ చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించుకోవడం చాలా దుర్మార్గమన్నారు. పరీక్షపేపర్లు వరుస లీకేజీ అవుతున్న ఎందుకు ఎన్టిఏని ప్రక్షాళన చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీటి పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు.

Also Read: జులై 1 నుంచి పింఛన్లు పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు

యూనివర్సిటీలలో కొందరు రాజకీయ పార్టీ కార్యకర్తలు లాగా పనిచేస్తున్నారని.. త్వరలో యూనివర్సిటీల పరిరక్షణకై సేవ్ యూనివర్సిటీ సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు . నీట్ రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తరహాలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.

#aisf
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe