MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల జైలులో కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. By V.J Reddy 18 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల జైలులో కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించింది. Delhi Excise policy CBI case | Delhi's Rouse Avenue Court has referred BRS leader K Kavitha to AIIMS for a medical checkup. A report has also been called from AIIMS. Her judicial custody has been extended till July 22. — ANI (@ANI) July 18, 2024 ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2024 మార్చి 15 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. నాలుగు నెలలుగా ఆమె జైలులో ఉన్నారు. ఈ స్కామ్ కు సంబంధించి మొదట కవితపై ఈడీ కేసు నమోదు చేయగా.. తర్వాత సీబీఐ సైతం ఎంటరైంది. ఈ కేసుల్లో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. #kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి