MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈరోజుతో సీబీఐ కస్టడీకి గడువు ముగుస్తున్న క్రమంలో కోర్టులో కవితను ప్రవేశపెట్టారు అధికారులు. సీబీఐ, కవిత తరఫున లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. కవిత జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందని.. ఇప్పటి వరకు నేరాన్ని రుజువు చేయడానికి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని చెరిపేస్తుందని సీబీఐ వాదనలు గట్టిగా వినిపించింది.
ఈ కేసులో అసలు విషయాలు బయటకు రావాలంటే కవితను విచారించాలని.. ఇందుకోసం కవిత రిమాండ్ ను పొడిగించి.. విచారించేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. సీబీఐ కేసులో కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 1న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.