లోకసభలో చర్చకు రానున్న ఢిల్లీ సర్వీస్ బిల్లు..ఇక రచ్చ రచ్చేనా? పార్లమెంట్లో మరోసారి దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిపూర్ అంశంపై కొనసాగుతున్న గందరగోళం మధ్య ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నేడు లోక్సభలో చర్చ కోసం ఢిల్లీ సర్వీస్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. By Bhoomi 03 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ సర్వీస్ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. అంతకుముందు మంగళవారం, ఢిల్లీలో సేవల నియంత్రణకు సంబంధించిన ఆర్డినెన్స్ స్థానంలో 'గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023' చర్చతోపాటు ఆమోదం కోసం లోక్సభలో ప్రవేశపెట్టబడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విపక్షాల సంకీర్ణమైన భారత ఎంపీలందరూ బిల్లును వ్యతిరేకిస్తారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం తెలిపారు. ఢిల్లీలో సేవలకు సంబంధించిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందబోదని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ బిల్లును విపక్ష కూటమి 'భారత్'లోని అన్ని విభాగాలు వ్యతిరేకిస్తాయని చెప్పారు. నేడు లోకసభకు వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు: ఇవాళ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బిల్లులో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. కంపెనీలపై విధించే గరిష్ట జరిమానా కూడా రూ. 250కోట్లకు తగ్గింది. కొత్త బిల్లు ప్రకారం...డేటా రక్షణ కోసం కంపెనీలు ఫిర్యాదు అధికారిని నియమించాలి. ఈ బిల్లులో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. కొత్త బిల్లు ప్రకారం...కంపెనీలు తమ స్వంత డేటా ఆడిటర్లను నియంచుకోవల్సి ఉంటుంది. కంపెనీలపై విధించిన పెనాల్టీని రూ. 250కోట్లకు తగ్గించడం ఊరటనిచ్చే అంశమే. ఈ బిల్లుతోపాటుగా ప్రభుత్వం జాబితాను కూడా రిలీజ్ చేస్తుంది.ఏ దేశాలకు డేటా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు...ఏ దేశాలకు చేయకూదనేది కంపెనీలకు తెలియచేస్తారు. ఇక స్టార్టప్ లకు ఉపశమనం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని కోసం ప్రభుత్వం కొన్ని పరిమితులను ఖరారు చేసినట్లు సమాచారం. కొత్త బిల్లులో డేటా ప్రాసెసింగ్ మొత్తంపై ప్రభుత్వం కంపెనీలకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతోపాటు 18ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలనే నిబంధనను కూడా సడలించే అవకాశం ఉంది. పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది #manipur-issue #data-protection-bill #delhi-services-bill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి