Big Breaking: కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ పోలీసుల షాక్.. అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో అరెస్టులు!

అమిత్ షా మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చిన పోలీసులు దాదాపు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి సతీష్ ఉన్నట్లు సమాచారం.

Big Breaking: కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ పోలీసుల షాక్.. అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో అరెస్టులు!
New Update

అమిత్ షా (Amit Shah) మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police). ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి సతీష్ ఉన్నారు. ఆయనతో పాటు గీత, శివ, తస్లీమ, అస్మా తదితరులు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ కు వచ్చి అమిత్ షా మార్ఫింగ్ వీడియోలకు సంబంధించిన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి సైతం వారు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ తరఫున ఆయన న్యాయవాది నిన్న ఢిల్లీ పోలీసులను కలిసి వివరణ ఇచ్చారు. అయితే.. ఢిల్లీ పోలీసుల కన్నా ముందుగానే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జితో మరో మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: Telangana Game Changer : పెద్దపల్లిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

అమిత్ షా మార్ఫింగ్ వీడియోల అంశానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. 469,505(1)c సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు పోలీసులు.  ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే.. ఆ వీడియోను మార్ఫింగ్ చేసిన కొందరు అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నట్లుగా ఎడిటింగ్ చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలతో పాటు కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదులో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు.ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. గాంధీభవన్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ కేసులో తాజాగా తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగడం.. గాంధీభవన్ లో అరెస్ట్ లు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర హోంశాఖ లేదా ఈసీ ఆదేశాలతోనే తెలంగాణ పోలీసులు ఈ అరెస్ట్ లు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe