బాలికకు డ్రగ్స్ ఇచ్చి పలు మార్లు .. మైనర్ పై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు...!

ఢిల్లీలో స్నేహితుని కుమార్తెపై ప్రభుత్వ అధికారి అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడే ముందు బాలికకు ప్రేమేందర్ ఖాఖా ప్రతిసారీ మాదక ద్రవ్యాలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకానొక సందర్బంలో బాలికకు మెలుకవ వచ్చి లేచి చూసే సరికి తన ఒంటిపై గాయాలు వున్నట్టు గమనించిందని వెల్లడించారు.

author-image
By G Ramu
New Update

మూడేండ్ల క్రితం బాలిక తండ్రి మరణించాడని చెప్పారు. కొవిడ్ సమయంలో ఆమె తండ్రి మరణించారని, కానీ ఆయన మరణానికి కొవిడ్ కారణం కాదన్నారు. తండ్రి మరణంతో బాలిక తీవ్రంగా కుంగిపోయిందన్నారు. బాలికపై నిందితుడు మొదటి సారిగా 31 అక్టోబర్ 2020న అత్యాచారం చేశాడన్నారు. తండ్రి మరణంతో కుంగిపోతున్న ఆమెను ఆమె తల్లి ఈశాన్య ఢిల్లీలో బురారీ ప్రాంతంలో వున్న ప్రేమోదయ్ ఖాఖా ఇంటికి పంపారన్నారు.

ఆ సమయంలోనే ఆమె మొదటి సారి నిందితుడు అత్యాచారం చేశాడన్నారు. ఐదు నెలల పాటు ఆమె అక్కడే వుందన్నారు. 2021 ఫి బ్రవరిలో మరోసారి ఆమెపై నిందితుడు అత్యాచారం చేశారన్నారు. ఆ తర్వాత కుటుంబానికి సంబంధించిన ఓ కార్యక్రమం ఉందని చెప్పి జార్ఖండ్ లోని తన నివాసానికి బాలిక వెళ్లిపోయిందన్నారు. మళ్లీ ఖాఖా ఇంటికి రాలేదన్నారు.

చర్చితో పాటు ఆయన ఇంట్లోనూ ఖాఖా తనపై అత్యాచారం చేశాడని బాలిక వాంగ్మూలం ఇచ్చిందన్నారు. బాలిక ప్రస్తుతం 12 వ తరగతి చదువుతోందన్నారు. తండ్రి మరణాంతరం ఆమె 9వ తరగతి తర్వాత పాఠశాలకు వెళ్లడం మాని వేసింది. ఆ తర్వాత ఓపెన్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరింది. ఓ వైపు తండ్రి చనిపోయిన బాధ, మరోవైపు తనపై జరుగుతున్న దాడులు చూసి బాలిక భయపడి పోయిందన్నారు.

అందువల్ల అత్యాచారం విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయిందన్నారు. ఆ తర్వాత ఆమె గర్బం దాల్చడంతో ఖాఖా తన భార్య సహాయంతో బాలికకు అబార్షన్ చేయించాడు. ఈ ఘటనలో వెలుగులోకి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో ఆస్పత్రిలో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించడంతో ఆమె అసలు విషయాలు వెల్లడించిందన్నారు.

మహిళా, శిశు అభివృద్ధి శాఖలో ప్రేమోదర్ ఖాఖా డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడు మరణించడంతో అతని కూతుర్ని ఖాఖా తన ఇంట్లోకి తీసుకు వచ్చారు. అక్కడ 2020 నుంచి 2021 జనవరి వరకు బాలికపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్బం దాల్చింది. ఈ క్రమంలో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాఖాతో పాటు అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు