ఢిల్లీ (Delhi) నగరం భూకంపంతో ( Earth Quake) వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా హడలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎన్‌సీఆర్ (Ncr) ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకపం తీవ్రత 6.2 గా నమోదు అయ్యింది.
దాదాపు ఒక నిమిషం పాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమి ఒక్కసారిగా ప్రకంపనలు ఇవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కార్యాలయాలల్లో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆఫీసుల్లో ఉన్న వారు అంతా కూడా భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇటు ఢిల్లీతో పాటు..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 10 సెకన్ల పైగా ప్రకంపనలు వచ్చాయని అధికారులు నిర్థారించారు. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది.
updated soon...