Kavitha to Supreme Court: సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్.. రేపే విచారణ! కవిత అరెస్ట్‌ను సవాలు చేస్తూ కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వెయ్యనున్నారు. కవిత తరుఫున ప్రముఖ లాయర్లు కపిల్ సిబల్, రోహత్గీ వాదించనున్నారు. ఇక రేపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై ఈడీ ఆమెను ప్రశ్నించనుంది. By Trinath 17 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత సుప్రీం గడప తొక్కనున్నారు. కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వెయ్యనున్నారు. కవిత అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వెయ్యనున్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత కేసు ఒకటి ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. అది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే. ఈ కేసులో తనను నేరుగా ఈడీ ప్రశ్నించకుండా ఉండేలా కవిత గతంలో పిటిషన్ వేశారు. ఇది ఇంకా విచారణలో ఉండగానే ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. ఇదే పాయింట్‌పై కవిత భర్త సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. కవిత తరుఫున ప్రముఖ లాయర్లు కపిల్ సిబల్, రోహత్గీ వాదించనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ ఏమిటి? నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని (Liquor Policy Scheme) అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది నూటికి నూరు శాతం ప్రైవేటుగా మారింది. దీనివల్ల రూ.3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది. కవిత పాత్ర ఏంటి? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో ‘సౌత్ గ్రూప్’ (South Group) ఒకటి. ఈ గ్రూప్‌ని కంట్రోల్ చేసే వారిలో వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్‌కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. Also Read: ఈడీ ఆఫీస్‌కు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు..! #kavitha #supreme-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి