Kejriwal: ఈడీ అధికారులపై కేజ్రీవాల్‌ నిఘా పెట్టారు.. బయటకొస్తున్న సంచలన నిజాలు!

అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులపై నిఘా పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు సంస్థకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది .

Kejriwal: ఈడీ అధికారులపై కేజ్రీవాల్‌ నిఘా పెట్టారు.. బయటకొస్తున్న సంచలన నిజాలు!
New Update

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. కేజ్రీవాల్ జైలులో నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చెబుతోంది. అయితే, దీని కోసం అతను కోర్టు పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్టీలో అతిపెద్ద నాయకుడు జైలులో ఉంటే పార్టీని ఎవరు నడిపిస్తారన్నదానిపై ఆప్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు ఇదే సమయంలో ఈ కేసు గురించి మరో సంచలన వార్త బయటకొచ్చింది.

నిఘా పెట్టారా?
అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై నిఘా పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు సంస్థకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది. దాల సమయంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుమారు 150 పేజీల పత్రాన్ని స్వాధీనం చేసుకుంది. డాక్యుమెంట్‌లో స్పెషల్‌ డైరెక్టర్-ర్యాంక్ అధికారి, జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన వివరాలు ఉన్నాయి.

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ ఇది పూర్తి గూండాయిజం అని అన్నారు. అటు ఢిల్లీలో పరిస్థితులు అదుపుతప్పకుండా ఉండేలా చూసుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ మేట్రో, పోలీసుల అభ్యర్థన మేరకు ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ITO మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ఐటీఓ చౌక్ వద్ద రహదారిని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హోలీకి ఇళ్లకు వెళ్లి షాపింగ్‌కు వెళ్లేవారు కూడా ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది . అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది.

Also Read: కేజ్రీవాల్‌ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe