Delhi Liquor Scam Case: కవితకు హై బీపీ... కోర్టులో పిటిషన్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు హైబీపీ ఉందని పిటిషన్‌లో పేర్కొన్న కవిత.. మెడికల్‌ రిపోర్ట్స్‌ ఇవ్వడం లేదని చెబుతున్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్ ఇవ్వాలని కవిత పిటిషన్‌ ఫైల్ చేశారు.

Kavitha: నా కొడుకును కలిసేందుకు అనుమతి ఇవ్వండి.. కవిత పిటిషన్
New Update

MLC Kavitha Health Condition: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ (ED) కస్టడీ కాసేపట్లో ముగియనుంది. కస్టడీని పొడిగించాలని ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టును కోరే అవకాశం ఉంది. మరోవైపు కోర్టులో కవిత మరో పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత ఆరోగ్యానికి సంబంధించిన పిటిషన్‌ ఇది. తనకు హైబీపీ (High Blood Pressure) ఉందని పిటిషన్‌లో పేర్కొన్న కవిత.. మెడికల్‌ రిపోర్ట్స్‌ ఇవ్వడం లేదని చెబుతున్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్ ఇవ్వాలని కవిత పిటిషన్‌ ఫైల్ చేశారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్‌ ఇవ్వాలని కవిత లాయర్లు ఈడీని కోరారు.

మరోవైపు కేజ్రీవాల్ తో కలిపి కవితను విచారించాలని ఈడీ అధికారులు ఆలోచిస్తున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే జైల్లో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై, మాగంటి రాఘవ, శరత్ చంద్రారెడ్డిలను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించాలనే ఆలోచనలో ఈడీ ఉందని తెలుస్తోంది. ఈ నెల 16న కవితకు వారం కస్టడీ విధించింది కోర్టు. కవితను మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా..? అన్నది కాసేపట్లో తేలిపోనుంది. లేదంటే జ్యూడీషియల్‌ రిమాండ్‌కు పంపిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

--> ఈనెల 15న కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించారు. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా..ఇవాల్టి వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారం రోజులుగా కవిత ఢిల్లీలోని ఈడీ కస్టడీలోనే ఉంటున్నారు. ఇవాల్టితో ఆమె ఈడీ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కాసేపట్లో ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు.

--> ఇక కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. గురువారం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ..నిన్న కోర్టులో హాజరుపరిచింది. రెండున్నర గంటల పాటు ఇరువర్గాల వాదనలు కొనసాగాయి. 10 రోజుల కస్టడీకి కేజ్రీవాల్ ని ఇవ్వాలని ఈడీ కోరగా..6 రోజుల కస్టడీకిచ్చింది కోర్టు. ఈ నెల 28న మధ్యాహ్నాం 2 గంటలకు కేజ్రీవాల్ ని కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను, కవితను విచారించాలని.. కవితను మరో వారం పాటు కస్టడీకివ్వాలని ఈడీ కోరే అవకాశముంది.

ALso Read: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు… రిటైర్డ్ ఐపీఎస్‌ తో పాటు, ఓ మీడియా ఛానెల్‌ అధినేత కూడా!

#mlc-kavitha #delhi-liquor-scam-case #kavitha-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి